News


మూడో రోజూ ముచ్చట- మార్కెట్‌ జూమ్‌

Thursday 26th March 2020
Markets_main1585221153.png-32695

బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ దన్ను
మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 4 శాతం అప్‌
సెన్సెక్స్‌ 1411 పాయింట్లు హైజంప్‌
324 పాయింట్లు ఎగసిన నిఫ్టీ
ఇండస్‌ఇండ్‌ 46 శాతం దూకుడు


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజీ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు మరోసారి జోరు చూపాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇండెక్సులు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్‌  1411 పాయింట్లు దూసుకెళ్లి 29,947 వద్ద నిలవగా.. నిఫ్టీ 324 పాయింట్లు జంప్‌చేసింది. 8,641 వద్ద ముగిసింది.  తద్వారా మార్చి డెరివేటివ్‌ సిరీస్‌ చివరి రోజు సైతం మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను కొనసాగించాయి. ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో బుధవారం సెన్సెక్స్‌ 1,862 పాయింట్లు(7 శాతం), నిఫ్టీ సైతం 517 పాయింట్లు(7 శాతం) చొప్పున పురోగమించిన విషయం విదితమే.

రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా..   ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 8.3 శాతం, రియల్టీ 7.3 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఐటీ 5-2 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌ 46 శాతం దూసుకెళ్లగా..  ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, హీరో మోటో, బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ఫ్రాటెల్‌, కొటక్‌ బ్యాంక్‌ 10-6.5 శాతం మధ్య పెరిగాయి. అయితే గెయల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,  ఆర్‌ఐఎల్‌, మారుతీ, అదానీ పోర్ట్స్‌ 3.3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.

బంధన్‌ బ్యాంక్‌ భళా
డెరివేటివ్‌ కౌంటర్లలో బంధన్‌ బ్యాంక్‌ 42 శాతం దూసుకెళ్లగా.. అశోక్‌ లేలాండ్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, పిరమల్‌, మహానగర్‌ గ్యాస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్, భారత్‌ ఫోర్జ్‌, డీఎల్‌ఎఫ్‌, నౌకరీ 29-13 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క యస్‌ బ్యాంక్‌ 15 శాతం కుప్పకూలగా..   నిట్‌ టెక్‌, జిందాల్‌ స్టీల్‌, బీవోబీ, బాలకృష్ణ, పీవీఆర్‌, ఎక్సైడ్‌, టీవీఎస్‌ మోటార్‌, పీఎన్‌బీ 6-3 శాతం మధ్య క్షీణించాయి.  బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 3.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1508 లాభపడగా.. 769 నష్టపోయాయి. రియల్టీ కౌంటర్లలో బ్రిగేడ్‌, ప్రెస్జేజ్‌, ఫీనిక్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియాబుల్స్‌, సన్‌ టెక్‌ 11-2 శాతం మధ్య ఎగశాయి. 

విక్రయాల బాటలోనే
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1893 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.., దేశీ ఫండ్స్‌(డీఐఐలు)  రూ. 738 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2153 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  డీఐఐలు రూ. 1554 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2989 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా..  డీఐఐలు రూ. 1082 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.You may be interested

వైరస్‌ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌ సరిపోదు: రాజన్‌

Thursday 26th March 2020

భారత్‌లో ప్రకటించిన లౌక్‌డౌన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని, వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఈ చర్య ఒక్కటి సరిపోదని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ‘‘ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే లౌక్‌డౌన్‌ ప్రజలను పనులకు వెళ్లకుండా ఇళ్లకే కట్టిపడేసింది. అదేమీ అత్యంత సురక్షిత ప్రదేశం కాదు. ప్రజలు మురికివాడల్లోనూ నివసిస్తున్నారు’’ అని రాజన్‌ బ్లూంబర్గ్‌ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. ఇన్ఫెక్షన్లను

ఆల్‌టైమ్‌ కనిష్టానికి 14 స్టాక్‌లు

Thursday 26th March 2020

బీఎస్‌ఈ500 ఇండెక్స్‌లో గురువారం 14 స్టాక్‌లు ఆల్‌టైమ్‌ కనిష్టానికి చేరాయి. దీనిలో ఫ్యూచర్‌ రిటైల్, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్, జస్ట్‌ డయిల్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, డిష్‌ టీవీ నెట్‌వర్క్, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్, శంకరా బిల్డింగ్‌ ప్రోడక్ట్స్, వరోక్‌ ఇంజనీరింగ్‌ షేర్లు ఉన్నాయి. ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్లు 5 శాతం పతనమై రూ.91.75 వద్ద వరుసగా 11 రోజు లోవర్‌ సర్క్యూట్‌ను తాకాయి.  ఐడీబీఐ ట్రస్టీషిప్‌

Most from this category