News


తొలుత హుషార్‌- తుదకు బేజార్‌

Friday 14th February 2020
Markets_main1581677589.png-31803

సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌
తొలుత లాభాల డబుల్‌ సెంచరీ
నిఫ్టీ 61 పాయింట్ల వెనకడుగు

తొలుత ఎస్‌అండ్‌పీ.. దేశ సావరిన్‌ రేటింగ్‌కు స్టేబుల్‌ ఔట్‌లుక్‌ను ప్రకటించడంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను చెల్లించకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్‌కావడంతో డీలాపడ్డాయి. వెరసి తొలుత లాభాల డబుల్‌సెంచరీ చేసిన సెన్సెక్స్‌ చివరికి అదే స్థాయిలో నష్టపోయింది. 202 పాయింట్లు క్షీణించి 41,258 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు నీరసించి 12,113 వద్ద స్థిరపడింది. ఏజీఆర్‌ చెల్లింపులకు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించవలసిందిగా కోరుతూ టెలికం కంపెనీలు చేసిన అభ్యర్థనపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. గడువులోగా బకాయిలను చెల్లించకపోవడంపై టెలికం శాఖ అధికారులను సైతం మందలించింది. దీంతో ఐడియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌సహా కొన్ని బ్యాంకింగ్‌ కౌంటర్లు డీలాపడ్డాయి. 

ఒడిదొడుకులు
ఎస్‌అండ్‌పీ దేశ సావరిన్‌ రేటింగ్‌కు స్టేబుల్‌ ఔట్‌లుక్‌ను ప్రకటించడంతోపాటు.. BBB-రేటింగును కొనసాగిస్తున్నట్లు పేర్కొనడంతో మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమయ్యాయి. ఓవైపు కరోనా భయాలు, మరోపక్క బలహీన స్థూల ఆర్థిక గణాంకాలు సైతం సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా సెన్సెక్స్‌ 41,702 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,183 వద్ద కనిష్టానికీ చేరింది. ఈ బాటలో నిఫ్టీ 12,247-12091 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

అన్ని రంగాలకూ నష్టాలే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడ్డాయి. మెటల్‌, బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ 1.25 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్‌, ఐషర్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, హీరోమోటో, కోల్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం 5.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే యస్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ, జీ, ఆర్‌ఐఎల్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో 5.5-0.5 శాతం మధ్య ఎగశాయి.

ఐడియా బేర్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా 22 శాతం కుప్పకూలగా.. పేజ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, సెయిల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎన్‌ఎండీసీ 5-3 శాతం మధ్య తిరోగమించాయి. మరోవైపు మైండ్‌ట్రీ, గ్లెన్‌మార్క్‌, లుపిన్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2.4-1.6 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.4 శాతం మధ్య క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1622 నష్టపోగా.. 912 మాత్రమే లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకున్నారు. రూ. 1061 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 960 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 49 కోట్లు,  దేశీ ఫండ్స్‌ రూ. 339 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌  చేసిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 209 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 345 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేశాయి. 
 You may be interested

ఎస్‌బీఐలో రిస్క్‌ కొద్దీ రాబడులు..: మోతీలాల్‌ ఓస్వాల్‌

Friday 14th February 2020

ఆర్థిక వృద్ధి కనిష్ట స్థాయిని చవిచూసిందని, వినియోగం ఇక్కడి నుంచి తప్పకుండా వృద్ధి చెందుతుందన్నారు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ షా. డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి కంపెనీల ఫలితాలు బాగున్నాయని, ఆటోమొబైల్‌ రంగానికి ఇంతకుమించి ప్రతికూలతలు ఉండకపోవచ్చన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.   టెలికం/ఏజీఆర్‌ భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ సంస్థలు మార్కెట్‌ వాటాను పెంచుకుంటాయి. ఇది ఈ కంపెనీల ‍స్టాక్స్‌ పనితీరులో

సుప్రీం ఎఫెక్ట్‌: పీఎస్‌యూలకు దెబ్బ..!

Friday 14th February 2020

ఏజీఆర్‌ అంశంలో టెలికాం కంపెనీల తీరుపై సుప్రీం కోర్టు మండిపడటంతో ఇతర పీఎస్‌యూ కంపెనీలు తన ఏజీఆర్‌ మోడిఫికేషన్‌ పిటీషన్లను ఉపసంహరించుకున్నాయి. గెయిల్‌ ఇండియా, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌లతో పాటు ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు రూ.1.72లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలను చెల్లించాల్సి ఉంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌లు కంపెనీలు పిటిషన్లు ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్రాడేలో ఈ కంపెనీ షేర్లు

Most from this category