News


మరిన్ని కంపెనీల ప్లాంట్ల మూసివేత

Wednesday 25th March 2020
news_main1585114167.png-32665

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోన్న నేపథ్యంలో పలు టైర్ల కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెలాఖరు వరకు ఉత్పత్తిని నిలిపివేసినట్లు అపోలో టైర్స్‌ మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. కేరళ, గుజరాత్, చెన్నై రాష్ట్రాల్లోని ప్లాంట్లలో మార్చి 31 వరకు కార్యకలాపాలను నిలుపుచేసినట్లు ప్రకటించింది. మరో టైర్ల ఉత్పత్తి సంస్థ సియట్‌ తమ ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసింది. ఇక టీవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌ కూడా దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్లాంట్లను మార్చి 31వరకు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా మార్చి నెల ఉత్పత్తి 10 శాతం వరకు తగ్గనుందని వివరించింది. 



You may be interested

అమెజాన్‌ సేవలకు అంతరాయం

Wednesday 25th March 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న కారణంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తుల పంపిణీని ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా నిలిపివేసింది. గృహ అవసరాలకు అవసరమైన అధిక ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తులను మాత్రమే డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు హ్యాండ్‌ శానిటైజర్లు, పరిశుభ్రతకు అవసరమైన వస్తువులతో పాటు పలు ప్యాకేజీ ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల సరఫరా చేస్తోంది. ఇందుకు అనుగుణంగా సప్లై చైన్‌ నిర్వహణలో

25,200 కోట్ల డాలర్ల నష్టం

Wednesday 25th March 2020

విమానయానంపై కోవిడ్‌ వైరస్‌ కాటు  ప్రభుత్వాలు ఆదుకోవాలి: ఐఏటీఏ  న్యూఢిల్లీ: కోవిడ్‌-19(కరోనా)వైరస్‌ కల్లోలం కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ప్రయాణీల ఆదాయంలో ఈ ఏడాది 25,200 కోట్ల డాలర్లు (19,15,200 కోట్లు)నష్టం వాటిల్లనున్నది. గత ఏడాది వచ్చిన ప్రయాణీకుల ఆదాయంలో ఇది దాదాపు 44 శాతానికి సమానం.  కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో పలు దేశాలు విమాన సర్వీసులపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆంక్షలు మరో మూడు నెలలు కొనసాగితే,

Most from this category