News


దీర్ఘకాలిక లాభాలపై పన్ను ఎత్తివేత?

Thursday 16th January 2020
Markets_main1579154023.png-30960

ఎల్‌టీసీజీ పన్నుకు చెక్‌
కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీర్ఘకాలిక లాభాలపై పన్ను విధింపును తొలగించే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గత బడ్జెట్‌(2019)లో కేంద్ర ఆర్థిక శాఖ దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాల(ఎల్‌టీసీజీ) విషయంలో పన్ను విధింపును ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఈ చర్యపై పలువర్గాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం పన్ను సలహాదారులు, నిపుణులతో ఎల్‌టీసీజీపై పన్ను తొలగింపు అంశంపై చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా లిస్టెడ్‌ కంపెనీలలో పెట్టుబడులపై పన్ను మినహాయింపు ప్రతిపాదనలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా మరిన్ని దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలియజేశారు. 

రెండేళ్లు..
దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రస్తుతం నిర్వచిస్తున్న ఏడాది కాలాన్ని రెండేళ్లకు సవరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఎల్‌టీసీజీపై 10 శాతం పన్ను విధిస్తున్న విషయం విదితమే. గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ న్యూయార్క్‌ ప్రసంగంలో ఈక్విటీ పెట్టుబడులపై అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పన్ను విధింపును చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని పలు దేశాలు ఎల్‌టీసీజీపై ఎలాంటి పన్ను విధించనందున దేశీయంగా ఈ అంశంపై ఇటీవల అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు, స్వల్పకాలిక మదుపరులుగా విభజిస్తూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. 

రూ. 40,000 కోట్లు
ఎల్‌టీసీజీపై పన్నును ప్రవేశసెట్టాక ప్రభుత్వానికి ఏటా రూ. 40,000 కోట్లవరకూ ఆదాయం సమకూరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. అభివృద్ధి చెందిన పలు దేశాలలో ఎల్‌టీసీజీపై పన్ను విధింపులేకపోవడంతో ఇన్వెస్టింగ్‌ వర్గాలు ఇందుకు డిమాండ్‌ చేస్తున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఫీఐలు), ఇతర పెట్టుబడి సంస్ధలు బడ్జెట్‌లో ఎల్‌టీసీజీపై పన్ను తొలగింపును ఆశిస్తున్నాయి. ఇందుకు వీలుగా ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు అందజేశాయి కూడా. ఫలితంగా ప్రభుత్వం ఏడాదికి మించిన సావరిన్‌, పెన్షన్‌ తదితర ఫండ్స్‌ పెట్టుబడులకు లబ్ది చేకూర్చే నిర్ణయాలు తీసుకునే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. డిజిన్వెస్ట్‌మెంట్‌లో ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే.. క్యాపిటల్‌ మార్కెట్లు జోరుమీదుండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌టీసీజీ, తదితర పన్ను సమస్యల కారణంగా డిజిన్వెస్ట్‌మెంట్‌కు దూరంగా ఉంటున్నట్లు ఈ సందర్భంగా పలు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయి. 

ఇతర ఆస్తులపై
లిస్టెడ్‌ ఈక్విటీలతోపాటు.. బంగారం, రియల్‌ ఎస్టేట్‌ తదితర ఆస్తులపై దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏకరూప విధానాలను ప్రభుత్వం అవలంబిం‍చాలని పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి. 
 



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Thursday 16th January 2020

మార్కెట్లో బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త రికార్డు స్థాయిని అందుకున్నప్పటికీ.., మెటల్‌ షేర్లు మాత్రం అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,920.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా-చైనాల మధ్య నిన్నరాత్రి జరిగిన మొదటిదశ వాణిజ్య ఒప్పందంపై అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చేశారు. అయితే ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు

యూఎస్‌-చైనా ట్రేడ్‌ డీల్‌-ఉపయోగమేంటి?

Thursday 16th January 2020

అమలు కష్టమేనంటున్న నిపుణులు సుమారు ఏడాదిన్నర కాలంగా అమెరికా, చైనా మధ్య కొన’..సాగుతున్న వాణిజ్య వివాదాలకు ఎట్టకేలకు తాత్కాలికంగా చెక్‌ పడింది. బుధవారం రెండు దేశాల మధ్య వాణిజ్య మైత్రికి తెరలేచింది. వెరసి రెండు దేశాలూ తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో రెండో దశ డీల్‌ను కుదుర్చుకునేందుకు త్వరలోనే చర్చలు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా.. ఈ ఒప్పందాలను మరింత విస్తరించుకునే

Most from this category