News


భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌ బొనాంజా సేల్‌

Saturday 15th February 2020
news_main1581757038.png-31825

ఎప్పుడూ వివిధ రకాల కొత్తకొత్త ఆఫర్లతో ముందుండే దేశీయ ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థ మరో బిగ్‌ సేల్‌కు రెడీ అవుతోంది. ఫిబ్రవరి17 నుంచి 21 వరకు మొబైల్‌పై బొనాంజాత సేల్‌ను ప్రకటించింది. దీనిలో ప్రధాన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌లతోపాటు , బడ్జెట్‌ ధరలలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ఏ మొబైల్‌ అయినా యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు మీద కొనుగోలు చేసినట్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపింది. రూ.15 వేలరూపాయల కేటగిరిలో శాంసంగ్‌ గెలాక్సీ ఏ50, వివో జెడ్‌1 ప్రొలు రూ.12,999 నుంచి రూ.11,990ధరలలో లభ్యం కానున్నాయి. వివోజెడ్‌1 . రియల్‌మి ఎక్స్‌టీలు ధరలు తగ్గి రూ.13,990, రూ,14,999 ధరలలో లభ్యం కానున్నాయి. దాదాపు అన్ని రకాల మొబైల్స్‌ తగ్గింపు ధరలలో ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 



You may be interested

ఈ షేరు మూడు రోజుల్లో 29 శాతం అప్‌..ఎందుకంటే!

Saturday 15th February 2020

వారాంతాన సరికొత్త గరిష్టానికి షేరు ఈ ఏడాది క్యూ3లో పటిష్ట ఫలితాలు షేర్ల ముఖవిలువ విభజన బాట షేరుకి రూ. 13.5 డివిడెండ్‌ కొద్ది రోజులుగా జోరుగా పరుగెడుతున్న ర్వైల్వే రంగ మౌలిక సదుపాయాల పీఎస్‌యూ.. ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ షేరు వారాంతాన సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 9 శాతం జంప్‌చేసి రూ. 573కు చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఆపై 4.5 శాతం లాభంతో రూ. 551 వద్ద ముగిసింది. ఇటీవల

జనవరిలో టాప్‌ ఎంఎఫ్‌లు ఏం చేశాయి?

Saturday 15th February 2020

జనవరిలో మ్యూచువల్‌ఫండ్స్‌లోకి పెట్టుబడులు ఐదు నెలల గరిష్ఠాలకు చేరాయి. ఈ నెల్లో దాదాపు 7880 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఫ్‌ల్లోకి వచ్చాయి. ఈ నెలలో టాప్‌ ఎంఎఫ్‌లు ఏమి కొన్నాయో, ఏమి అమ్మినవో ఒకసారి చూద్దాం... 1. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌: జనవరి నాటికి 2100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిఉంది. అధిక శాతం(సుమారు 28 శాతం) ఫైనాన్షియల్‌రంగం, తర్వాత 9శాతం ఇండస్ట్రియల్స్‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిఉంది. జనవరిలో ఈ

Most from this category