News


ఎల్‌ఐసీ హౌసింగ్‌- డెన్‌ నెట్‌వర్క్స్‌ అప్‌

Thursday 16th January 2020
Markets_main1579156626.png-30962

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
గృహ రుణ విభాగంలో 2020 పేరుతో సరికొత్త ఆఫర్లను ప్రకటించడంతో మార్టిగేజ్‌ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఉదయం 11.40 ప్రాంతంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.7 శాతం పెరిగి రూ. 469 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 470ను అధిగమించింది. నిర్మాణంలో ఉన్న, లేదా సొతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న గృహాల కొనుగోలుకి వీలుగా పలురకాల ఆఫర్లతో రుణాలు అందిస్తున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. 2020 హోమ్‌ లోన్‌ పేరుతో ఈ ఆఫర్లను అందిస్తన్నట్లు పేర్కొంది. కంపెనీలో ప్రమోటర్లకు 40.31% వాటా ఉంది. 

డెన్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో డెన్‌ నెట్‌వర్క్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం డెన్‌ నెట్‌వర్క్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.7 శాతం పెరిగి రూ. 57 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 58ను అధిగమించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డెన్‌ నెట్‌వర్క్స్‌ రూ. 19.4 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది(2018-19) క్యూ3లో రూ. 32.4 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం అమ్మకాలు 3 శాతం పెరిగి రూ. 318 కోట్లను తాకాయి. వీటిలో సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం 9 శాతం పుంజుకుని రూ. 206 కోట్లకు చేరింది.



You may be interested

జెట్‌ ఎయిర్‌- స్టెరిలైట్‌ టెక్‌కు షాక్‌

Thursday 16th January 2020

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నాయి. వాణిజ్య వివాదాల పరిష్కారానికి వీలుగా అమెరికా, చైనా మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బుధవారం అమెరికా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. అయితే దేశీయంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. విభిన్న వార్తల కారణంగా ప్రయివేట్‌ రంగ కంపెనీలు.. జెట్‌ ఎయిర్‌వేస్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Thursday 16th January 2020

మార్కెట్లో బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త రికార్డు స్థాయిని అందుకున్నప్పటికీ.., మెటల్‌ షేర్లు మాత్రం అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,920.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా-చైనాల మధ్య నిన్నరాత్రి జరిగిన మొదటిదశ వాణిజ్య ఒప్పందంపై అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చేశారు. అయితే ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు

Most from this category