News


ఎల్‌ఐసీ విలువ ఎంత?!

Friday 14th February 2020
news_main1581659938.png-31787

పలు రకాల మదింపులు చేస్తున్న నిపుణులు
రూ. 9.5 లక్షల కోట్లుండొచ్చని అంచనా
లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో వాటాలు విక్రయించాలన్న ప్రభుత్వ ఆలోచన దేశీయ మార్కెట్లో అతిపెద్ద మార్కెట్‌వాల్యూ ఉన్న లిస్టెడ్‌ కంపెనీని సృష్టించబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ. 70 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఐపీఓ కార్యరూపం దాలిస్తే దేశంలో అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టిస్తుంది. ఐపీఓ విజయవంతంగా పూర్తయితే ప్రభుత్వం ఈ సంవత్సరానికి పెట్టుకున్న పెట్టుబడుల ఉపసంహరణ టార్గెట్‌లో దాదాపు మూడోవంతు సమకూరుతుందని అంచనా. ఇప్పటివరకైతే కంపెనీ వాల్యూషన్‌, ఎంత వాటా విక్రయిస్తారు.. తదితర వివరాలు ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ విలువను ఫ్యూచర్‌ ప్రాఫిట్స్‌ ప్రస్తుత వాల్యూ తదితర పద్ధతుల్లో అనలిస్టులు అనధికారికంగా లెక్కగడుతున్నారు. 
- మాక్క్వైరీ మదింపు: ఎల్‌ఐసీ ప్రతిఏటా షేర్‌హోల్డర్లకు(ప్రభుత్వం) ఇచ్చే మిగులులో 5 శాతం వాటా ప్రస్తుత విలువను తీసుకొని మదింపు చేసింది. ఈ ప్రకారం ఎల్‌ఐసీ ఎంబెడెడ్‌ విలువ రూ. 20- 25వేల కోట్లుంటుందని లెక్కగట్టింది. ఇందులో రియల్టీ ఆస్తుల మార్కెట్‌ విలువ, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీల నుంచి పొందే లాభాలను చేర్చలేదు. ప్రస్తుతం కంపెనీ ఆర్జించే మిగులులో 95 శాతం పాలసీహోల్డర్లకు పంచుతుండగా, 5 శాతాన్ని షేర్‌హోల్డర్లకు కంపెనీ పంచుతోంది. షేర్‌హోల్డర్లకు మరింత వాటా పెంచితే కంపెనీ విలువ మరింత పెరుగుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ సంస్థ దాని ఎంబెడెడ్‌ విలువకు 5.6 రెట్లు అధికంగా ట్రేడవుతోంది. చైనాకు చెందిన పింగ్‌ ఇన్స్యూరర్‌ సంస్థ తన ఎంబెడెడ్‌ వాల్యూ కన్నా 1.33 రెట్లు అధికంగా ట్రేడవుతోంది. ఎల్‌ఐసీ అధికారికంగా తన ఎంబెడెడ్‌ విలువ ప్రకటించనందున ఈ పద్ధతిలో కంపెనీ మార్కెట్‌ విలువను సరిగా అంచనా వేయలేమని నిపుణుల భావన. 
- ఏయూఎం ఆధారిత మదింపు: ఎక్కువమంది అనలిస్టులు ఎల్‌ఐసీ వాల్యూషన్‌ను మార్కెట్‌ క్యాప్‌ టు ఏయూఎం నిష్పత్తి ఆధారంగా లెక్కించవచ్చంటున్నారు. ఇందుకోసం సంస్థ ఆఫర్‌ చేసే మార్కెట్‌ లింక్‌డ్‌, నాన్‌మార్కెట్‌ లింక్‌డ్‌ ఉత్పత్తులను వేరువేరుగా మదింపు చేయాలి. ఎల్‌ఐసీ ఎక్కువగా అంటే 98 శాతం నాన్‌లింక్‌డ్‌ ఉత్పత్తులపై ఆధారపడుతోంది. అదే హెచ్‌డీఎఫ్‌సీలైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ కంపెనీల వ్యాపారంలో ఈ రెండు రకాల ఉత్పత్తులు సమానంగా ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వ్యాపారంలో లింక్‌డ్‌ ఉత్పత్తుల వాటా అధికం. ప్రస్తుతం ఎల్‌ఐసీ ఆఫర్‌ చేస్తున్న ఉత్పత్తులను, దాని అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌(ఏయూఎం)ను పరిశీలించి మదింపు చేస్తే సంస్థ విలువ దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయలుండొచ్చని నిపుణుల అంచనా
కంపెనీ విలువను అధికారికంగా ప్రకటించేవరకు నిజ విలువను గ్రహించలేమని బీమారంగ నిపుణులు భావిస్తున్నారు. You may be interested

ఏజీఆర్‌ కేసులో టెలికం కంపెనీలకు షాక్‌

Friday 14th February 2020

కోర్టు ఆదేశాల బేఖాతరుపై సుప్రీం కోర్టు సీరియస్‌ కంపెనీల ఎండీలను కోర్టుకు హాజరుకమ్మని ఆదేశాలు పతన బాట పట్టిన టెలికం, బ్యాంకు షేర్లు ఏజీఆర్‌ బకాయిల విషయంలో టెలికం కంపెనీలకు తాజాగా షాక్‌ తగిలింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు

నేటి వార్తల్లోని షేర్లు

Friday 14th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు నెస్లే ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో పరిమాణాత్మక వృద్ధి పెరగడంతో నెస్లే ఇండియా నికర లాభం 38.40 శాతం పెరిగి రూ.473.02 కోట్లకు చేరింది. జయప్రకాశ్‌ అసోసియేట్స్‌: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.874.44 కోట్లకు చేరింది. కాగా క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర నష్టం

Most from this category