News


అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల టాప్‌ సిఫార్సులు

Friday 13th September 2019
Markets_main1568360923.png-28354

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల సిఫార్స్‌ చేసిన టాప్‌ స్టాకులు:
బ్రోకరేజి: జేపీ మోర్గాన్‌
ఇన్ఫోసిస్‌ స్టాక్‌పై ‘ఓవర్‌ వెయిట్’ను కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను షేరుకు రూ. 850గా ఈ బ్రోకరేజి నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇన్ఫోసిస్‌ బాగా ప్రదర్శన చేసిందని, రిస్క్‌ తీసుకోకూడదని అనుకునే వారికి ఈ స్టాకు ఇప్పటికీ ఆకర్షణియంగా కనిపిస్తోందని ఈ బ్రోకరేజి తెలిపింది. ఈ కంపెనీ ఆదాయవృద్ధి ఆర్థిక సంవత్సరం 2021 లో ఓ మోస్తరుగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 

బ్రోకరేజి: సీటీ
జిందాల్ స్టీల్ అండ్‌ పవర్ లిమిటెడ్(జేఎస్‌పీఎల్‌)పై ఈ బ్రోకరేజి ‘బై’ రేటింగ్‌ను కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను షేరుకు రూ. 188 గా నిర్ణయించింది. ఈ కంపెనీలోకి ఆపరేటింగ్‌ నగదు ప్రవాహాం బలంగా ఉందనే విషయం కంపెనీ వార్షిక నివేదికను పరిశీలిస్తే తెలుస్తోందని ఈ బ్రోకరేజి అభిప్రాయపడింది. తాజా పీపీఏ(పవర్‌ పర్చేజ్‌ ఎగ్రిమెంట్‌)లు ఈ కంపెనీ స్టాక్‌ మంచి ప్రదర్శనను చేయడానికి సహాయపడతాయని ఈ బ్రోకరేజి వివరించింది. 

బ్రోకరేజి: సీఎల్‌ఎస్‌ఏ
గ్లెన్‌మార్క్‌ ఫార్మాపై ఈ బ్రోకరేజి సెల్‌ రేటింగ్‌నిచ్చి, టార్గెట్‌ ధర (షేరుకు రూ. 350)ని మార్చలేదు. ‍కంపెనీ ఎఫ్‌సీఎఫ్‌(ఫ్రీ క్యాష్‌ ఫ్లో) ప్రతికూలంగా ఉందని,  కంపెనీ మొత్తం రుణాలు ఆర్థిక సంవత్సరం 22 నాటికి రూ.27 బిలియన్లకు చేరుకుంటుందని ఈ బ్రోకరేజి తెలిపింది. 

బ్రోకరేజి: గోల్డ్‌మాన్‌ శాక్స్‌
మదర్సన్ సుమి రేటింగ్‌ను ‘బై’ రేటింగ్‌కు ఈ బ్రోకరేజి నవీకరించింది. అంతేకాకుండా టార్గెట్‌ ధరను రూ. 121గా నిర్ణయించింది. ఈ కంపెనీ తక్కువ వాల్యుషన్‌ వద్ద ట్రేడవుతోందని, ఆర్డర్‌ పుస్తకం బలంగా ఉండడంతో కంపెనీ లాభాల వృద్ధి పెరుగుతుందని తెలిపింది.



You may be interested

ఇంట్రాడే గరిష్టం నుంచి బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Friday 13th September 2019

బ్యాంకింగ్‌ రంగ అ‍‍మ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఇంట్రాడే గరిష్టం నుంచి 1శాతానికి పైగా పతనమైంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,772.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 100 పాయింట్లు పెరిగి 27,908.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్లో నెలకొన్న అమ్మకాలతో ఇండెక్స్‌

ఈ షేర్లు కొనొచ్చు

Friday 13th September 2019

సెప్టెంబర్‌ నెలకు సంబంధించి వివిధ బ్రోకరేజిలు బై రేటింగ్‌ ఇచ్చిన స్టాకులు: బ్రోకరేజ్: ఫిలిప్ కాపిటల్ కోరమాండల్ ఇంటర్నేషనల్: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ .500; రిటర్న్‌: 32 శాతం స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన యూరియేతర కంపెనీలలో కోరమండల్‌ ఇం‍టర్నేషనల్‌ ముందు వరుసలో ఉంది. బ్యాక్‌వార్డ్‌ ఇంటిగ్రేషన్‌ కలిగి ఉండి క్యాప్టివ్ ఫాస్పోరిక్ ఆమ్లం, వ్యవసాయ రసాయనాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీ తన ప్రత్యర్ధ కంపెనీలయిన జువారీ ఆగ్రో, జీఎస్‌ఎఫ్‌సీ,

Most from this category