News


ఫండ్స్‌లో రాబడులు ఆశించిన విధంగా లేవా?

Thursday 12th July 2018
personal-finance_main1531335364.png-18233

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ప్రతీ నెలా మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి వస్తున్న నిధులు రూ.7,300 కోట్లను చేరాయి. ఫండ్స్‌లో రాబడులు ఆశాజనకంగా ఉండడం, సులభంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు యాప్స్‌, ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులోకి రావడం, ఫండ్స్‌ పట్ల అవగాహన తదితర అంశాలు ఈ స్థాయి పెట్టుబడులకు కారణం. అయితే, ఇలా ఇన్వెస్ట్‌ చేస్తున్న అందరూ లాభాలనే ఆర్జిస్తున్నారా...? అంటే అవునని చెప్పలేం. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. అవేంటన్నది నిపుణులు తెలియజేస్తున్నారు. 

 

లక్ష్యాలను విస్మరించరాదు
పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని పట్టించుకోకుండా నడవడం పెద్ద ప్రతికూలం. ఎందుకంటే లక్ష్యాల కోసమే ఇన్వెస్ట్‌ చేసేది. మరి లక్ష్యాన్ని పట్టించుకోని ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే గమ్యం లేకుండా ప్రయాణించడం వంటిదే. లక్ష్యంతో సంబంధం లేకుండా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మీ అవసరాలను తీర్చలేని పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు వచ్చే ఏడాది మీ పాప విద్యకు రూ.లక్ష కావాలనుకోండి. ఇందుకోసం రికరింగ్‌ డిపాజిట్‌లో ప్రతీ నెలా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లడం లేదా బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవడం సరైనది. అలా కాకుండా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మార్కెట్లు షాక్‌ ఇవ్వొచ్చు. అలాగే, దీర్ఘకాలంలో నిధి కోసం ఈక్విటీ పథకాలను ఎంచుకోకుండా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల బాట పట్టినా ఇదే తీరులో ఉంటుంది పరిస్థితి.

 

మార్కెట్లో సంబంధం లేదు...
మార్కెట్లు తగ్గినప్పుడే ఇన్వెస్ట్‌ చేయాలి, పెరిగినప్పుడే విక్రయించాలన్న ధోరణి సాధారణ ఇన్వెస్టర్లకు ఫలితాన్ని ఇవ్వదు. దీనికి బదులు క్రమానుగతంగా ఎంతో కొంత దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలి. ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే కాలంతో కూడిన రిస్క్‌ను అధిగమించొచ్చని జేఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు జితేంద్ర సోలంకి తెలిపారు.

 

తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టొద్దు
చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ను గత పనితీరు ప్రామాణికంగా ఎంపిక చేసుకుంటారు. కానీ, డెట్‌ ఫండ్స్‌కు ఇది సరికాదు. ఉదాహరణకు 2016 డిసెంబర్‌లో డెట్‌ ఫండ్‌ను అంతకుముందు పనితీరు ఆధారంగా ఎంచుకుని ఉండుంటే అది దీర్ఘకాలిక గిల్ట్‌ఫండ్‌ అయి ఉంటుంది. కానీ, ఆ తర్వాత 12, 15 నెలల్లో చేతులు కాలి ఉంటాయి. ఎందుకంటే 2017, 18లో వడ్డీ రేట్లు పెరిగాయి. అంతకుముందు చూసిన రాబడులు క్షీణిస్తున్న వడ్డీ రేట్ల వల్ల వచ్చినవి.

 

మరీ ఎక్కువ పథకాలు...
ఎక్కువ మంది చేసే సాధారణంగా తప్పిదం... ఎక్కువ పథకాలను ఎంచుకోవడం. భిన్న పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌ డైవర్సిఫై అవుతుందని భావిస్తుంటారు. కానీ, ప్రతీ పథకంలోనూ పోర్ట్‌ఫోలియో పరంగా (భిన్న స్టాక్స్‌) డైవర్సిఫికేషన్‌ ఉంటుందని మర్చిపోవద్దు. ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే వాటి పనితీరును ట్రాక్‌ చేయడం కష్టమవుతుంది. రెండు, మూడు పథకాలను ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేయడం అనుకూలం.  

రిస్క్‌కు అనుకూలించే పోర్ట్‌ఫోలియో
ఏఏ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్నది ఎవరికి వారు తమ రిస్క్‌ ఆధారంగా ఎంచుకోవాలి. ఈక్విటీ పథకాల్లోనే అంతా ఇన్వెస్ట్‌ చేయడం కూడా సరైంది కాదు. డెట్‌ సాధనాల్లోనూ పెట్టుబడులు ఉండాలి. అలాగే, ఏడాదికోసారి పథకాల పనితీరు మదింపు వేసుకుని నిపుణుల సలహా ఆధారంగా అవసరమైతే పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవాలి.
 You may be interested

వాణిజ్య ఘర్షణలున్నా మార్కెట్లు ముందుకే: ప్రభుదాస్‌

Thursday 12th July 2018

అమెరికా, చైనాలు సుంకాల పోరు మొదలు పెట్టినప్పటికీ, దేశీయ మార్కెట్లు ముందుకే వెళతాయంటోంది ప్రభుదాస్‌ లీలాధర్‌ సంస్థ. మనదేశ ఆర్థిక వృద్ధిపై వీటి ప్రభావం ఉండదని, ఇక్కడి మార్కెట్లు వచ్చే ఆరు నెలల్లో కొత్త స్థాయిలకు చేరతాయని ప్రభుదాస్‌ లీలాధర్‌ సంయుక్త ఎండీ దిలీప్‌ భట్‌ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు.   ప్రశ్న: ఐటీ స్టాక్స్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి పనితీరు

నెట్ న్యూట్రాలిటికి ఓకే..

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కంటెంట్ అందించే విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా నియంత్రించే దిశగా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు టెలికం కమిషన్‌ (టీసీ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫార్సులను బుధవారం జరిగిన సమావేశంలో ఆమోదించింది. రిమోట్ సర్జరీ, అటానామస్ కార్లు మొదలైన కీలక అప్లికేషన్స్‌, సర్వీసులకు మాత్రం నెట్ న్యూట్రాలిటీ నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది. టెలికం కమిషన్

Most from this category