News


ఐఆర్‌సీటీసీ హైజంప్‌- నాట్కో కుదేల్‌

Thursday 13th February 2020
Markets_main1581568472.png-31748

సరికొత్త గరిష్టానికి ఐఆర్‌సీటీసీ
నాట్కో ఫార్మా 6 శాతం పతనం 
క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రైల్వే రంగ పీఎస్‌యూ ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. అయితే మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఫార్మా రంగ హైదరాబాద్‌ కంపెనీ నాట్కో ఫార్మా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఐఆర్‌సీటీసీ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. నాట్కో భారీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం...

ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌
ఈ ఏడాది(2019-20) క్యూ3లో ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ నికర లాభం దాదాపు మూడు రెట్లు ఎగసి రూ. 206 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 266 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 65 శాతం పుంజుకుని రూ. 716 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు  22.7 శాతం నుంచి 37.1 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఉదయం 9.50 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో ఐఆర్‌సీటీసీ షేరు 9.2 శాతం దూసుకెళ్లి రూ. 1545 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1599 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది.

నాట్కో ఫార్మా 
ఈ ఏడాది(2019-20) క్యూ3లో నాట్కో ఫార్మా నికర లాభం 34 శాతం క్షీణించి రూ. 104.5 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం సైతం 38 శాతం వెనకడుగుతో రూ. 129 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం తక్కువగా రూ. 482 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 37.4 శాతం నుంచి 26.7 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో నాట్కో ఫార్మా షేరు 6.2 శాతం పతనమై రూ. 665 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 655 వరకూ క్షీణించింది.  

 



You may be interested

ఐఆర్‌సీటీసీ లాభం మూడు రెట్లు అప్‌

Thursday 13th February 2020

ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో దాదాపు మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.74 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 180 శాతం ఎగసి రూ.206 కోట్లకు పెరిగిందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. అన్ని విభాగాలు మంచి వృద్ధి సాధించడంతో నికర లాభం

అశోక్‌ లేలాండ్‌ లాభం 87 శాతం డౌన్‌

Thursday 13th February 2020

రూ.5,189 కోట్లకు తగ్గిన ఆదాయం రెండు నెలల్లో బీఎస్‌-6 హెవీ డ్యూటీ వెహికల్స్‌ న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 87 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.429 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.57 కోట్లకు పడిపోయినట్లు అశోక్‌ లేలాండ్‌ ఎమ్‌డీ, సీఈఓ విపిన్‌ సోంధి చెప్పారు.

Most from this category