News


‘‘ఐఫోన్‌ 11’’ సేల్‌ 27 నుంచి...

Thursday 12th September 2019
news_main1568258389.png-28316

- ప్రారంభ ధర రూ. 64,900
- హైఎండ్‌ రూ. 109,900

కాలిఫోర్నియాలో మంగళవారం అట్టహాసంగా విడుదలైన ‘ఐఫోన్‌ 11’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత ధరలను.. ఆపిల్‌ కంపెనీ బుధవారం ప్రకటించింది. మొత్తం ఆరు రంగుల్లో లభ్యంకానున్న  ‘ఐఫోన్‌ 11’ ధర ఇక్కడి మార్కెట్లో . రూ. 64,900 ప్రారంభం కానుంది. ‘ఐఫోన్‌ 11 ప్రో’  ప్రారంభ ధర రూ. 99,900 కాగా, ‘ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్’ భారత ధర రూ. 1,09,900 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈనెల 27 నుంచి నూతన సిరీస్‌ ఇక్కడి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఆపిల్‌ వాచ్‌ ధర రూ. 40,900 
వాచ్ సిరీస్ 5 (జీపీఎస్) ధర రూ. 40,900 నుంచి ప్రారంభం కానుండగా.. వాచ్ సిరీస్ 5 (జీపీఎస్ ప్లస్‌ సెల్యూలార్) ధర రూ. 49,900 నుంచి ప్రారంభంకానున్నట్లు ప్రకటించింది. ఇక  వీడియో గేమింగ్‌ సర్వీస్‌-ఆర్కేడ్‌ నెలవారీ ధర రూ. 99 వద్ద నిర్ణయించింది. ఐపాడ్‌ ధర రూ. 29,900. 



You may be interested

వృద్ధి కథ... బాలీవుడ్‌ సినిమాయే!

Thursday 12th September 2019

మందగమనం రూపంలో విలన్‌  8తో ముగిసే సంవ్సరాల్లో సంక్షోభాలు  చివరికి సుఖాంతమే  మందగమనంపై కోటక్‌ వ్యాఖ్యలు  ముంబై: మన దేశ వృద్ధి కధ అచ్చం బాలీవుడ్‌ సినిమాలాగానే ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌  చైర్మన్‌ ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సినిమాను తలపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆరంభంలో ప్రేమ కధలాగానే వృద్ది జోరుగానే మొదలైందని, ఆ తర్వాత మందగమనం రూపంలో విలన్‌ ఎదురయ్యాడని, దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని వివరించారు.

ఆటోమొబైల్‌కు జీఎస్‌టీ తగ్గింపుపై త్వరలోనే నిర్ణయం

Thursday 12th September 2019

ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు: మంత్రి గడ్కరీ న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగానికి జీఎస్‌టీ తగ్గింపు విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం జీఎస్‌టీ మండలికే ఉంటుందని తెలిసిందే. ‘‘రాష్ట్రాలతో ఆర్థిక శాఖ చేస్తున్న సంప్రదింపులపై నేను నమ్మకంతో ఉన్నాను. ఒకవేళ సాధ్యపడితే వారు ఓ నిర్ణయం తీసుకుంటారు’’ అని మంత్రి

Most from this category