News


అంచనాల్ని అందుకున్న ఇన్ఫోసిస్‌

Friday 11th October 2019
Markets_main1570790775.png-28831

 ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ క్యూ2 ఫలితాలు మార్కెట్‌ అంచనాల్ని అందుకున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో ఇన్ఫోసిస్‌ కన్సాలిడేటెడ్‌ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 2.2 శాతం క్షీణించి రూ. 4,019 కోట్లకు తగ్గింది. నికరలాభం తగ్గినప్పటికీ, ఈ ఏడాది జూన్‌ క్వార్టర్తో పోలిస్తే 5 శాతం పెరగడం విశేషం. మార్కెట్‌ అంచనా రూ. 4008 కోట్లుగా వుంది. కంపెనీ ఆదాయం మాత్రం రూ. 23,255 కోట్లకు పెరిగింది. ఆదాయం సైతం అత్యధిక శాతం విశ్లేషకుల అంచనాలకంటే అధికంగానే నమోదుకావడం గమనార్హం.  శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెల్లడికాగా, గైడెన్స్‌ పెంచుతుందనే ఆశాభావంతో ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 814 వద్ద ముగిసింది. పూర్తి సంవత్సరానికి ఆదాయం గైడెన్స్‌ను కంపెనీ పెంచింది. ఆదాయం 9-10 శాతం మేర వృద్ధిచెందుతుందని అంచనావేసింది. ఇది 8.5-10 శాతంగా గత క్వార్టర్లో ప్రకటించిన అంచనాల్ని స్వల్పంగా పెంచుతూ కంపెనీ సవరించింది. 



You may be interested

మధ్య స్థాయి వినియోగ స్టాక్స్‌ ర్యాలీ!

Saturday 12th October 2019

పండుగల డిమాండ్‌ నేపథ్యంలో మధ్య స్థాయి వినియోగ కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. గత నెల రోజుల కాలంలో 11 మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ నూతన గరిష్టాలను నమోదు చేయగా, ఇందులో ఆరు స్టాక్స్‌ వినియోగ రంగాలకు చెందినవే కావడం గమనార్హం. అవి వర్ల్‌పూల్‌ ఇండియా, బెర్జర్‌ పెయింట్స్‌, వోల్టాస్‌, పీఅండ్‌జీ హైజీన్‌, కోల్గేట్‌ పామోలివ్‌, గ్లాక్సోస్మిత్‌ క్లెయిన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌.    ఈ ఏడాది వర్ల్‌పూల్‌ ఇండియా షేరు ఇప్పటి వరకు 47

సామాన్యుడి సేవింగ్స్‌కు సంరక్షణేది?!

Friday 11th October 2019

ప్రముఖ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ సూటి ప్రశ్న బ్యాంకింగ్‌ రంగంలో బయటపడుతున్న వరుస కుంభకోణాలపై ప్రముఖ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు రుణమాఫీలు, కార్పొరేట్‌ రుణ రైటాఫ్‌లు చేయడం అనైతికమని దుయ్యబట్టారు. సగటు జీవి దాచుకునే అల్పమొత్తాలకు సరైన రక్షణ కల్పించే విత్త వ్యవస్థ లేకపోవడం అన్యాయమని విమర్శించారు. ఇటీవల బయటపడిన పీఎంసీ కుంభకోణ నేపథ్యంలో సదరు బ్యాంకు ఖాతాదారుల విత్‌డ్రాయల్స్‌పై ఆర్‌బీఐ పరిమితి విధించిన

Most from this category