News


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం రూ.1,300 కోట్లు

Wednesday 15th January 2020
news_main1579060579.png-30940

  • 32 శాతం వృద్ధి 
  • రూ.9,074 కోట్లకు మొత్తం ఆదాయం 
  • క్షీణించిన రుణ నాణ్యత 

(అప్‌డేటెడ్‌...)

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.1,300 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.985 కోట్లు)తో పోల్చితే 32 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.7,232 కోట్ల నుంచి రూ.9,074 కోట్లకు పెరిగిందని వివరించింది. కేటాయింపులు అధికంగా ఉన్నా, నికర వడ్డీ, ఇతర ఆదాయాలు బాగా పెరగడం, నిర్వహణ లాభం కూడా మంచి వృద్ధి సాధించడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు...

రుణ వృద్ధి 20 శాతం...
నికర వడ్డీ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.3,074 కోట్లకు పెరిగింది. రుణ వృద్ధి 20 శాతంగా ఉంది. వడ్డీయేతర (ఇతర) ఆదాయం 22 శాతం పెరిగి రూ.1,789 కోట్లకు వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 30 శాతం ఎగసి రూ.2,746 కోట్లకు పెరిగింది. కేటాయింపులు రూ.1,043 కోట్లకు పెరిగాయి. కేటాయింపులు వార్షికంగా 72 శాతం, సీక్వెన్షియల్‌గా 41 శాతం చొప్పున వృద్ధి చెందాయి. 


తగ్గిన రుణ నాణ్యత...
గత క్యూ3లో 1.13 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 2.18 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 0.59 శాతం నుంచి 1.05 శాతానికి చేరాయి.  అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణ నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో స్థూల మొండి బకాయిలు 2.19 శాతం, నికర మొండి బకాయిలు 1.12 శాతంగా ఉన్నాయి. ఈ క్యూ2లో రూ.1,102 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.1,945 కోట్లకు పెరిగాయి. 



You may be interested

భారత్‌లోకి మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌

Wednesday 15th January 2020

ఏప్రిల్‌లో ఈక్యూసీ ఎస్‌యూవీ విడుదల పూనే: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌.. భారత లగ్జరీ ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌ ‘ఈక్యూ’ని మంగళవారం ఇక్కడ ప్రారంభించింది. నూతన బ్రాండ్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ఈక్యూసీ’ పేరిట తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలకానుందని సంస్థ ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌కు సంబంధించిన అన్ని

బంధన్‌ బ్యాంక్‌ లాభం రూ.731 కోట్లు

Wednesday 15th January 2020

గత క్యూ3లో రూ.331 కోట్ల నికర లాభం  ఈ క్యూ3లో ఆదాయం రూ.3,075 కోట్లు  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో భారీగా పెరిగింది. గత క్యూ3లో రూ.331 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.731 కోట్లకు పెరిగిందని బంధన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.1,884 కోట్ల నుంచి రూ.3,075 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  బంధన్‌ బ్యాంక్‌లో

Most from this category