News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 11th October 2019
Markets_main1570765085.png-28813

అమెరికా-చైనాల మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్ల సంకేతాలకు అనుగుణంగా భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 114 పాయింట్ల లాభంతో 37,994 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల పెరుగుదలతో 11,257 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. చైనా వైస్‌ప్రెసిడెంట్‌తో తాను శుక్రవారం సమావేశం కానున్నానని, గురువారం ఇరుదేశాల మధ్య మొదలైన వాణిజ్య చర్చలు బాగా కొనసాగుతున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్లు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లు పెరిగాయి. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 0.8 శాతం వరకూ లాభపడగా, తాజాగా ఆసియాలో జపాన్‌, హాంకాంగ్‌, చైనా సూచీలు 2.5 శాతం వరకూ లాభాలతో ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది నిముషాల్లోనే సెన్సెక్స్‌ లాభం 200 పాయింట్లకు, నిఫ్టీ లాభం 58 పాయింట్లకు చేరింది. 

టీసీఎస్‌ 3 శాతం డౌన్‌..

క్రితం రోజు నిరుత్సాహకర ఫలితాల్ని వెల్లడించిన టీసీఎస్‌ 3 శాతం గ్యాప్‌డౌన్‌తో రూ. 2000లోపు ప్రారంభమయ్యింది. మరోవైపు ట్రేడ్‌డీల్‌పై ఆశలతో మెటల్‌ షేర్లు టాటా స్టీల్‌, వేదాంతలు 2 శాతం వరకూ పెరిగాయి. కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1.5 శాతం వరకూ లాభపడ్డాయి. 



You may be interested

కోపరేటివ్‌ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు చర్యలు

Friday 11th October 2019

అవసరమైతే చట్టానికి సవరణలు ఇందు కోసం ఓ ప్యానెల్‌ ఏర్పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన ముంబై: కోపరేటివ్‌ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు అవసరమైతే చట్టంలో సవరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇటీవలే ఆర్‌బీఐ ఆంక్షల పరిధిలోకి వెళ్లిన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్ల ఆగ్రహాన్ని మంత్రి గురువారం ముంబై వచ్చిన సందర్భంగా స్వయంగా చవిచూశారు. దక్షిణ ముంబైలోని బీజేపీ

టీసీఎస్‌.. అంచనాలు మిస్‌..

Friday 11th October 2019

- క్యూ2లో లాభం 1.8 శాతం అప్‌; రూ. 8,042 కోట్లు - ఆదాయం 6 శాతం వృద్ధి; రూ. 38,977 కోట్లు - షేరుకి రూ. 40 ప్రత్యేక డివిడెండ్‌ ముంబై: దేశీ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. గురువారం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం

Most from this category