News


సెన్సెక్స్‌ 250 పాయింట్లు డౌన్‌

Tuesday 3rd December 2019
Markets_main1575361822.png-30027

ఆర్‌బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత

మరోసారి తెరపైకి అంతర్జాతీయ వాణిజ్య భయాలు

మెటల్‌, బ్యాంక్‌, ఇన్ఫ్రా రంగ షేర్ల అమ్మకాల ఒత్తిడితో మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ దాదాపు 250 పాయింట్లును కోల్పోగా, నిఫ్టీ 12వేల దిగువకు దిగివచ్చింది. నేటి ఉదయం దేశీయ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ పరిణాలు సూచీలను నష్టాల్లోకి మళ్లించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ దేశంలో దిగుమతయ్యే బ్రెజిల్‌, అర్జెంటీనా స్టీల్‌, అల్యూమినియంలపై టారీఫ్‌లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు మంగళవారం ప్రకటించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈక్విటీ మార్కెట్లల్లోంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అలాగే దేశీయం నేడు ప్రారంభమైన మూడు రోజుల పాటు జరగనున్న ఆర్‌బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపారు. ముఖ్యంగా మెటల్‌, బ్యాంక్‌, ఇన్ఫ్రా రంగ షేర్ల అమ్మకాలతో ఒక దశలో నిఫ్టీ 88 పాయింట్ల మేర నష్టపోయి 11,960.05 వద్ద, సెన్సెక్స్‌ 248 పాయింట్లను కోల్పోయి 40,554.04 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు సెన్సెక్స్‌ 169 పాయింట్ల నష్టంతో 40,634 వద్ద, నిఫ్టీ 66పాయింట్లను కోల్పోయి 11,982.10 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ, రియల్టీ రంగ షేర్లకు మాత్రం స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అత్యధికంగా మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు నష్టపోతున్నాయి.

జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటాస్టీల్‌, అదానీ పవర్‌, యస్‌బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 4శాతం నుంచి 9శాతం వరకు నష్టపోయాయి. ఇన్ఫోసిస్‌, హీరోమోటోకార్ప్‌, టైటాన్‌, టీసీఎస్‌, బజాజ్‌ అటో షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఈ స్టాకుల్లో పాజిటివ్‌ సిగ్నల్స్‌!

Tuesday 3rd December 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 45 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో  కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, హావెల్స్‌ ఇండియా, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, శ్రేయ్‌ఇన్‌ఫ్రా, ఎల్‌టీ ఫుడ్స్‌, రాడికో ఖైతాన్‌, ట్రెంట్‌, ఏబీబీ ఇండియా, లవబుల్‌ లింగరీ, జేకే లక్ష్మీ సిమెంట్‌ తదితరాలున్నాయి.

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Tuesday 3rd December 2019

బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను పునరుద్ధరించనున్నట్లు ట్రంప్‌ ప్రకటనతో మంగళవారం మెటల్‌ షేర్లు  అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో దాదాపు 3శాతం నష్టపోయింది. ‘‘బ్రెజిల్‌, అర్జెంటీనాలు డాలర్‌ మారకంలో తన దేశపు కరెన్సీ విలువను భారీగా క్షీణింపజేసుకుంటున్నాయి. తద్వారా ఈ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అమెరికా రైతులకు భారీ నష్టాలను

Most from this category