News


అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

Wednesday 14th August 2019
Markets_main1565760977.png-27754

  • జూలైలో 3.15 శాతం
  • ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయిలోనే కట్టడి

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో వినియోగ ధరల సూచీలో పేర్కొన్న వస్తువులు, ఉత్పత్తుల బాస్కెట్‌ ధర మొత్తం కేవలం 3.15 శాతమే పెరిగిందన్నమాట. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత స్థాయిలోనే రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం కొనసాగుతుండడం గమనార్హం. 2 శాతానికి ప్లస్‌ 2 శాతం లేదా మైనస్‌ 2 శాతంగా ఉండేలా చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచిస్తోంది.  అంటే 4 శాతం దాటితే ధరల తీవ్రతను మైనస్‌లోకి వెళితే వ్యవస్థలోని మందగమన పరిస్థితులకు ఇది సంకేతంగా ఉంటుంది. తాజా సమీక్షా నెల జూలైలో ఆహార ధరల సూచీ పెరిగినప్పటికీ ఇంధనం, లైట్‌ ధరలు అదుపులో ఉన్నాయి. 2018 జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.17 శాతం. 2019 జూన్‌లో 3.18 శాతంగా ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- ప్రధాన సూచీలను పరిశీలిస్తే...
- కేవలం ఆహార విభాగాన్ని చూస్తే, వినియోగ ఆహార ధరల సూచీ (సీఎఫ్‌పీఐ)  2.36 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఇది 2.25 శాతం. అయితే జూన్‌లో 4.66 శాతంగా ఉన్న కూరగాయల ధరలు జూలైలో 2.82 శాతంగా నమోదయ్యాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 5.68 శాతం నుంచి 6.82 శాతానికి పెరిగాయి. పండ్ల ధరలు పెరక్కపోగా మైనస్‌లోనే ఉన్నాయి. -0.86 శాతంగా నమోదయ్యాయి. జూన్‌లో ఈ తగ్గుదల (మైనస్‌) 4.18 శాతం. ప్రొటీన్‌ ఆధారిత మాంసం, చేపల ధరల పెరుగుదల జూన్‌ (9.01 శాతం తరహాలోనే కేవలం 9.05 శాతంగా ఉంది. అయితే గుడ్ల ధరలు 1.62 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గాయి. 
- ఇంధనం, లైట్‌ కేటగిరీలో ధర జూలై క్షీణించి -0.36 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ పెరుగుదల రేటు 2.32 శాతంగా ఉంది. 
- ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రమాణంగా ఉండే విషయం తెలిసిందే. 



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీ పరిధిలోకి గృహ రుణ కంపెనీలు

Wednesday 14th August 2019

ఇక వీటిపై ఆర్‌బీఐ నియంత్రణలు ఎన్‌బీఎఫ్‌సీ పరిధిలోకి గృహ రుణ కంపెనీ గృహ రుణ కంపెనీలు (హౌసింగ్‌ ఫైనాన్స్‌) ఇక బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌ల) పరిధిలోకి రానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయం వల్ల ఇకపై హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఆర్‌బీఐ ప్రత్యక్ష నియంత్రణలోకి రానున్నాయి. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ యాక్ట్‌, 1987 సరవణ ప్రకారం, తాజా పరిణామం

ఓఎన్‌జీసీ లాభం రూ.5,904 కోట్లు

Wednesday 14th August 2019

ఆదాయం రూ.26,555 కోట్లు న్యూఢిల్లీ: తగ్గిన  చమురు ధరల ప్రభావం ఓఎన్‌జీసీ లాభాలపై పడింది. అయినప్పటికీ లాభాల క్షీణతను 4 శాతానికి పరిమితం చేసి జూన్‌ క్వార్టర్‌లో రూ.5,904 కోట్లను ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,144 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం 2.4 శాతం తగ్గి రూ.26,555 కోట్లకు పరిమితం అయింది. ప్రతీ బ్యారెల్‌ చమురును ఉత్పత్తి చేసి విక్రయించడం ద్వారా రూ.66.30 డాలర్లను ఆర్జించింది. అంతక్రితం

Most from this category