News


4శాతం నష్టపోయిన ఏడీఆర్‌లు

Thursday 15th August 2019
Markets_main1565857005.png-27789

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు  ఏడాదిలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఏడీఆర్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 4శాతం వరకు నష్టపోయాయి. అత్యధికంగా టాటామోటర్‌ ఏడీఆర్‌ 4శాతం నష్టపోయింది. అలాగే విప్రో ఏడీఆర్‌ 3.50శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 2.50శాతం చొప్పున పతనమయ్యాయి. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.50శాతం మేర నష్టపోయాయి. 
ట్రంప్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య పద్దతి బెడిసికొట్టడంతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక మందగమన భయాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్‌ కర్వ్ కన్వర్షన్‌ ద్వారా ఆర్థిక మాంద్యం ఆవహిస్తున్న సంకేతాలు బాండ్ల మార్కెట్ల నుంచి వెలువడటంతో అమెరికా సూచీలు నిన్నటి ట్రేడింగ్‌లో  ఏడాదిలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. అయితే చివర్లో కొంత రివకరిని సాధించినప్పటికీ, డౌ జోన్స్‌ ఇండెక్స్‌ 800 పాయింట్ల నష్టంతో 25,479 వద్ద, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 85 పాయింట్లు పతనమై 2,840, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 238 పాయింట్లు కోల్పోయి 7,490 వద్ద స్థిరపడ్డాయి. 



You may be interested

నష్టాలా మార్కెట్లో.. ర్యాలీ చేసిన స్టాకులు

Thursday 15th August 2019

మార్కెట్లు ప్రస్తుతం బేర్‌ చేతుల్లో చిక్కుకున్నాయి. గత ఎనిమిదేళ్లలో మొదటి సారి మార్కెట్లు ప్రతికూల రాబడులను ఇవ్వడం చూశాం. గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం నుంచి ఇప్పటి వరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1.4 శాతం నష్టపోయింది. అదే విధంగా నిఫ్టీ 50 3.5 శాతం కోల్పోపోయింది. యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ ఆందోళనవలన అంతర్జాతీయ మందగమనం పెరిగింది. అంతేకాకుం‍డా చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకోడానికి కారణమయ్యింది. ఐఎల్ అండ్‌

‘జీ’ హుజూర్‌..మోకరిల్లిన ట్రంప్‌

Thursday 15th August 2019

బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...చైనా అధ్యక్షుడి ముందు దాదాపు మోకరిల్లినంత పనిచేశారు. రెండెళ్లు, పదేళ్ల యుఎస్‌ ట్రెజరీ ఈల్డ్‌ల మధ్య ఇన్వర్షన్‌ జరగడంతో (పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ని రెండేళ్ల బాండ్‌ ఈల్డ్‌ మిం‍చిపోవడం) గత సెషన్‌లో యుఎస్‌ డోజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ సూచీ 800 పాయింట్లు కుప్పకూలింది. ఇలా ఇన్వెర్షన్‌ జరగడం సమీప భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం కమ్మేస్తుందనడానికి సంకేతం. 2007 మహా మాంద్యం తర్వాత...ఇలా ఈల్డ్‌

Most from this category