News


చేతక్‌ ఎలక్ట్రిక్‌ @రూ.లక్ష

Wednesday 15th January 2020
news_main1579058877.png-30932

  • ప్రారంభ ధర రూ. లక్ష 
  • బుకింగ్‌ అమౌంట్‌ రూ. 2000
  • ఆన్‌లైన్‌లో అవకాశం
  • ఫిబ్రవరి నెలాఖరు నుంచి డెలివరీలు

ముంబై: ప్రముఖ వాహ‌న త‌యారీ కంపెనీ బజాజ్‌ ఆటో ఒకప్పటి తన ఐకానిక్‌ స్కూటర్‌ ‘చేతక్‌’ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నూతన తరానికి తగిన విధంగా ఈసారి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదలచేసింది. ఈ-స్కూటర్‌ ప్రారంభ ధర రూ. లక్ష కాగా, ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీలు పోనూ ఇది ఎక్స్‌-షోరూం ధరని కంపెనీ వివరించింది. అంటే, రోడ్‌ ట్యాక్స్‌, బీమా కలపని ధర ఇది. డిస్క్ బ్రేక్‌లు, లగ్జరీ ఫినిషింగ్‌ కలిగిన ప్రీమియం ఎడిషన్‌ ధర రూ. 1.15 లక్షలుగా ఉంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగిన చేతక్‌ ఎలక్ట్రిక్‌ బుకింగ్స్‌ సంక్రాంతి పండుగ రోజే (నేటి నుంచి) ప్రారంభంకానున్నాయి. సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ఈ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని, ఇందుకు ఇనీషియల్‌ అమౌంట్‌ కింద రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ వెల్లడించారు. 

మూడేళ్ల వారంటీ...
ఈ-స్కూటర్‌కు ఏడాదికి ఒకసారి లేదంటే.. 12,000 కిలోమీటర్లు తిరిగిన ప్రతిసారి కనీస నిర్వహణ అవసరమని కంపెనీ వివరించింది. కస్టమర్లకు కంపెనీ నుంచి 50,000 కిలోమీటర్ల వరకు లేదంటే, మూడేళ్లు ఏది ముందైతే అది వారంటీగా లభిస్తుంది. స్కూటర్‌లోని లిథియం-అయాన్ బ్యాటరీకి కూడా వారంటీ వర్తిస్తుంది. 



You may be interested

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ‘2020 హోమ్‌ లోన్‌’ ఆఫర్‌

Wednesday 15th January 2020

ముంబై: ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ అయిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ‘2020 హోమ్‌లోన్‌ ఆఫర్‌’ను బుధవారం ఆవిష్కరించనుంది. దీని కింద గృహ రుణాలపై పలు ఆఫర్లను అందించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ‘నివాసం ఉన్నప్పుడే చెల్లించండి’ అనే పథకం కింద.. తీసుకున్న రుణానికి అసలును (ప్రిన్సిపల్‌) ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా రుణం జారీ చేసిన 48 నెలల తర్వాత (ఈ రెండింటిలో ఏది ముందయితే

విప్రో లాభం రూ.2,456 కోట్లు

Wednesday 15th January 2020

2 శాతం క్షీణత  3 శాతం పెరిగిన ఆదాయం  ఒక్కో షేర్‌కు రూ. 1 డివిడెండ్‌  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.2,456 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.2,510 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించిందని  విప్రో సీఈఓ, ఎమ్‌డీ అబిదాలి జడ్‌ నీముచ్‌వాలా తెలిపారు. ఆదాయం మాత్రం రూ.15,060 కోట్ల నుంచి 3 శాతం

Most from this category