News


క్వాలిటీ స్టాక్స్‌ కొనుగోలుకు మంచి సమయం

Wednesday 25th March 2020
Markets_main1585156595.png-32679

ప్రస్తుత మార్కెట్‌ పతనంలో నాణ్యమైన కంపెనీలు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచి ఆలోచనగా లాడరప్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ ఎండీ రాఘవేంద్ర పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల ఆస్తుల్లో మార్పులు చేసుకోవాలని.. ఈక్విటీలకు మూడేళ్ల దృష్టితో మరింత కేటాయింపులు చేసుకోవాలని సూచించారు.

 

నాణ్యమైన స్టాక్స్‌ ఇప్పుడు ఎంతో చౌక ధరల్లో లభిస్తున్నాయని రాఘవేంద్ర అన్నారు. కనుక వాటిల్లో పెట్టుబడులకు ఇది చక్కని తరుణంగా పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు నాణ్యమైన స్టాక్స్‌ అధిక వ్యాల్యూషన్ల బుడగలతో లేవని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండడమే మార్కెట్‌లో తీవ్ర పతనానికి కారణంగా ఆయన పేర్కొన్నారు. చాలా దేశాలు లౌక్‌డౌన్‌కు వెళుతున్నాయని, చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం ఏర్పడుతోందన్నారు. అయితే, ఈ వైరస్‌ను కట్టడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చేస్తాయన్నారు. అన్ని రంగాల్లోనూ మంచి పెట్టుబడి అవకాశాలు కనిపిస్తున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా రాఘవేంద్ర తెలిపారు. ప్రస్తుత సంక్షోభంలో ఏ రంగానికి మినహాయింపు లేదన్నారు. మార్కెట్లకు ఎంతో ఇష్టమైన స్టాక్స్‌ కూడా బాగా పడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిణామాల్లో నాణ్యమైన కంపెనీలు తక్కువ ధరల్లో లభిస్తు‍న్నాయని చెప్పారు. వాటిని కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఒక్కసారి అస్థిరతలు సద్దుమణిగితే తిరిగి ఈ స్టాక్స్‌లో ర్యాలీ చూడొచ్చన్నారు.

 

కేవలం కొన్ని రోజుల్లోనే సంపదకు భారీగా గండి పడిందని.. గతంలో ఈ తరహా సందర్భాల్లో భయం తగ్గిపోతే మార్కెట్ల రికవరీ కూడా అంతే వేగంగా ఉండడాన్ని చూసినట్టు రాఘేంద్ర చెప్పారు. సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఏడాది పట్టినా గానీ, ఈ సమయంలో తమ పెట్టుబడులను కొనసాగించడమే మంచి ఆలోచనగా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వాణిజ్యం నిలిచిపోవడం, వినియోగం తగ్గిపోవడంతో తదుపరి త్రైమాసికంలో అమెరికా, యూరోప్‌లో ఆర్థిక వృద్ధి కనిపించదన్నారు. కరోనా వైరస్‌కు ఇప్పటివరకైతే అంతం కనిపించడం లేదని, ఒక్కసారి దీన్ని నియంత్రిస్తే ప్రపంచ వృద్ధిని తిరిగి చూడొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరహా సంక్షోభాల్లో ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు లిక్విడిటీ కోరుకుంటారని, దాంతో సురక్షిత సాధనాలైన బంగారంలోనూ అమ్మకాలు చేస్తున్నట్టు రాఘవేంద్ర తెలిపారు. చాలా వరకు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు సాగిస్తుంటే, డీఐఐలు (దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు) కొనుగోళ్లు చేస్తున్నారని రాఘవేంద్ర చెప్పారు. మార్కెట్లు పడిపోతున్న సమయంలోనూ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు రావడమే ఫండ్స్‌ కొనుగోళ్లకు కారణంగా పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్‌ ఒకనాక అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌ అని, ఎఫ్‌ఐఐలు ప్రస్తుతం అమ్మకాలు సాగించినా, తర్వాత తిరిగి పెట్టుబడులతో తప్పకుండా వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. You may be interested

బ్యాంకుల పనివేళలు మారాయి..

Wednesday 25th March 2020

కరోనా వైరస్‌ నివారణ చర్యలు, లౌక్‌డౌన్‌ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వాటి వేళ్లలో మార్పులు చేశాయి. లౌక్‌డౌన్‌ తొలగిపోయే తక్కువ సిబ్బందితో, తక్కువ సమయం పాటు సేవలు అందించనున్నాయి. బ్యాంకు శాఖలకు రాకుండా ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకులు కస్టమర్లను సూచిస్తున్నాయి. చెల్లింపులు, నగదు బదిలీ లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌లు వంటివి మినహా ఇతర బ్యాంకింగ్‌ సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకు ఉద్యోగుల

రెండో రోజూ మార్కెట్‌.. బౌన్స్‌బ్యాక్‌

Wednesday 25th March 2020

2009 తదుపరి ఇండెక్సుల హైజంప్‌ 7 శాతం ఎగసిన సెన్సెక్స్‌, నిఫ్టీ అదే బాటలో 8 శాతం లాభపడ్డ బ్యాంక్‌ నిఫ్టీ ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి జోరందుకున్నాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా రెండో రోజు దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 1,862 పాయింట్లు(7 శాతం) జంప్‌చేసి 28,536 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 517 పాయింట్లు(7 శాతం) దూసుకెళ్లి 8318 వద్ద ముగిసింది. వెరసి

Most from this category