News


28 శాతం ఎగసిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లాభం

Thursday 15th August 2019
Markets_main1565851474.png-27776

అనుబంధ కంపెనీల దన్ను 
-13 శాతం వృద్ధితో రూ.19,092 కోట్లకు మొత్తం ఆదాయం 


న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 28 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.14 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.18 కోట్లకు పెరిగిందని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. అనుబంధ కంపెనీలు ​ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ల పనితీరు బాగా ఉండటంతో ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.16,937 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.19,092 కోట్లకు పెరిగిందని వివరించింది. నిర్వహణ లాభం(కన్సాలిడేటెడ్‌) 31 శాతం పెరిగి రూ.4,217 కోట్లకు పెరిగిందని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. స్థూల లాభం 35 శాతం పెరిగి రూ.2,814 కోట్లకు చేరిందని వివరించింది. మొత్తం వ్యయాలు రూ.14,899 కోట్ల నుంచి రూ.16,326 కోట్లకు పెరిగాయని పేర్కొంది. సిమెంట్‌ విభాగం ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.10,178 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. విస్కోస్‌ విభాగం ఆదాయం 1 శాతం పెరిగి రూ.2,509 కోట్లకు చేరిందని తెలిపింది. రసాయనాల విభాగం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.1,503 కోట్లకు, ఆర్థిక సేవల విభాగం ఆదాయం 18 శాతం పెరిగి రూ.3,625 కోట్లకు పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 3.5 శాతం లాభంతో రూ.735 వద్ద ముగిసింది. 



You may be interested

భారత్‌ ఇంకా వర్ధమాన దేశమేమీ కాదు..

Thursday 15th August 2019

ఇకపై అక్రమంగా ప్రయోజనాలు తీసుకోనిచ్చేది లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు వాషింగ్టన్‌: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ఇతర దేశాలపై విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి భారత్‌, చైనాపై విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన 'వర్ధమాన దేశాల' హోదా ముసుగులో భారత్‌, చైనా అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై ఇలాంటివి సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. భారత్‌, చైనాలు ఆసియాలో ప్రస్తుతం ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగాయని..

అమ్మకానికి కాఫీ డే 'గ్లోబల్‌ పార్క్‌'

Thursday 15th August 2019

కొనుగోలు చేసిన బ్లాక్‌స్టోన్‌ డీల్‌ విలువ సుమారు రూ. 3,000 కోట్లు అల్ఫాగ్రెప్ సెక్యురిటీస్‌లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ఒప్పందం విలువ సుమారు రూ. 28 కోట్లు రుణభారం తగ్గించుకునేందుకే అమ్మకాలు  న్యూఢిల్లీ: వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ (సీడీఈ) తాజాగా రుణాల భారం తగ్గించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్ టెక్‌ పార్క్‌ను అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించాలని

Most from this category