News


వ్యూహాత్మక వాటాల అమ్మకానికి మోగిన గంట

Saturday 12th October 2019
news_main1570855482.png-28840

  • అడ్వైజర్ల నుంచి బిడ్లను ఆహ్వానించిన ప్రభుత్వం
  • కాంకర్‌, నీప్కో, టీహెచ్‌డీసీల్లో వాటాల విక్రయం

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం సలహాదారులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. కంటెయినర్‌ కార్పొరేషన్‌ (కాంకర్‌), నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (నీప్కో), టీహెచ్‌డీసీ ఇండియాల్లో వాటాల అమ్మకానికి సంబంధించి అడ్వైజర్ల (లావాదేవీ సలహాదారు/న్యాయ సలహాదారు/ఆస్తుల విలువ మదింపుదారు) నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాంకర్‌లో కేంద్రానికి 54.80 శాతం వాటా ఉండగా, ఇందులో 24.80 శాతం వాటాను అట్టిపెట్టుకుని, 30 శాతం వాటాను వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు విక్రయించాలన్నది కేంద్రం ప్రణాళిక. తద్వారా యాజమాన్య నియంత్రణ ప్రైవేటు కంపెనీకి వెళుతుంది. ఇందుకు కేంద్ర కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపింది. టీహెచ్‌డీసీ ఇండియా, నీప్కో రెండూ విద్యుదుత్పత్తి సంస్థలు. వీటిల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాలను ప్రభుత్వరంగ విద్యుత్‌ సం‍స్థ ఎన్‌టీపీసీకి విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. తగినంత అనుభవం కలిగిన పేరున్న సంస్థలు నవంబర్‌ 4లోపు తమ ప్రతిపాదనలు సమర్పించాలని దీపమ్‌ తన నోటిఫికేషన్‌లో కోరింది. అడ్వైజర్ల నియామకం అనంతరం ఆసక్తిగల ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం రూపంలో రూ.1.05 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 



You may be interested

యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం!

Saturday 12th October 2019

దీర్ఘకాలంగా కొనసాగిన యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌కి పాక్షీక సంధి కుదిరింది. యుఎస్‌-చైనా ప్రతినిధులు మధ్య ప్రారంభమైన వాణిజ్య చర్చలు శుక్రవారం నాడు ఓ కొలిక్కి వచ్చాయి. ఇరు దేశాల మధ్య పరిమితితో కూడిన వాణిజ్య ఒప్పందమైన స్వల్పకాలంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   పాక్షిక ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు..   ఈ పాక్షిక ఒప్పందం, యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందంలో కీలకమైనదని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

కోపరేటివ్‌ బ్యాంకుల నియంత్రణపై ఆర్‌బీఐ చర్చ

Saturday 12th October 2019

చండీగఢ్‌: పంజాబ్‌ అండ్‌ మహరాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకులో కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో... కోపరేటివ్‌ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థపై ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు శుక్రవారం చర్చించింది. కోపరేటివ్‌ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు సూచనలు చేసేందుకు గాను ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే చండీగఢ్‌లో ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సమావేశం జరిగింది.

Most from this category