News


15వేల బ్యాంకు శాఖల ఏర్పాటుకు కేంద్రం ఆదేశం

Thursday 16th January 2020
news_main1579169582.png-30969

దేశంలో అందరికీ బ్యాంకింగ్‌ సేవల్ని విస్తరించేందుకు కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 15వేల కొత్త శాఖల్ని ఏర్పాటు చేయాలని బ్యాంకింగ్‌ రంగ దిగ్గజాలను కోరినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని గ్రామాల్లో ప్రతి 15 కిలోమీటర్ల పరిధిలో ఒక కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఏయే ప్రాంతాల్లో  శాఖల్ని ఏర్పాటు చేయాలనే అంశంపై తుది జాబితా రూపొందించి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు అందజేసింది. కొత్తగా ప్రారంభమయ్యే శాఖ కచ్చితంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన ప్రదేశంలోనే ఉండాలని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు మీడియాకు తెలిపారు.  అనధికారిక రుణాలను బ్యాంకింగ్‌ రుణాలుగా మార్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రుణాల వడ్డీరేట్లను తగ్గించి తద్వార ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది’’ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ఏర్పడే ఈ బ్రాంచులు వారంలో కనీసం 4నుంచి 5రోజులు పనిదినాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.

గతేడాది మార్చి 2019నాటికి ఆయా బ్యాంకులకు దేశవ్యాపంగా 1.20లక్షల బ్రాంచులు, దాదాపు 2లక్షల ఏటీఎంలు ఉన్నట్లు గణాంకాలు  చెబుతున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 35,649 బ్రాంచులు మాత్రమే ఉన్నాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2019 మార్చి చివరి నాటికి ప్రాంతీయ బ్యాంకుల అవుట్‌లెట్ల సంఖ్య 52వేలకు చేరుకుంది. అంతకు ఏడాది 2018తో పోలిస్తే ఈ పెరుగదల 3శాతంగా మాత్రంగానే ఉంది. మెట్రో నగరంలో ఒక బ్రాంచ్‌ రెండేళ్లలో లాభదాయకంగా మారుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నాలుగేళ్లలో మూసివేయబడుతుంది. కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త బ్రాంచుల ఏర్పాటు, పనితీరు నియమాలను సులభతరం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్‌లెస్ అవుట్‌లెట్‌లు దాదాపు 5.5లక్షలకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం బ్యాంకింగ్ అవుట్‌లెట్లలో వ్యాపార కరస్పాండెంట్ల వాటా 91శాతంగా ఉంది. 



You may be interested

ఒడిదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో సరి

Thursday 16th January 2020

ఇంట్రాడేలో రికార్డ్‌ గరిష్టాలకు మార్కెట్లు నష్టాల బాటలో మెటల్‌ ఇండెక్స్‌  స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇంట్రాడేలో మరోసారి సరికొత్త గరిష్టాలను తాకాయి. ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లు బలపడి 41,932 వద్ద నిలవగా.. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 12,356 వద్ద స్థిరపడింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 42,059 వరకూ ఎగసింది. తద్వారా తొలిసారి 42,000

ఈ ఏడాది మార్కెట్ల నుంచి 9% రిటర్న్స్‌?

Thursday 16th January 2020

ఈ కేలండర్‌ ఏడాది(2020) దేశీ స్టాక్‌ మార్కెట్లు 8-9 శాతం స్థాయిలో రిటర్నులు అందించే వీలున్నట్లు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌.. ఈక్విటీ విభాగం సీఐవో మహేష్‌ పాటిల్‌ అంచనా వేస్తున్నారు. 2019ని ప్రతిబింబిస్తూ ఈ ఏడాది కూడా లార్జ్‌ క్యాప్స్‌ జోరు చూపవచ్చని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం.. ఆర్థిక రికవరీ  వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ ఆర్జన 21 శాతం జంప్‌చేయవచ్చు. కార్పొరేట్‌ బ్యాంకులు ఇందుకు

Most from this category