News


రూ. 19వేల కోట్లివ్వండి!

Wednesday 15th January 2020
news_main1579068938.png-30945

చమురు కంపెనీలను కోరుతున్న ప్రభుత్వం
గతేడాదితో పోలిస్తే 5 శాతం అధికంగా రికార్డు స్థాయిలో రూ. 19000 కోట్ల డివిడెండ్‌ను ఇవ్వాలని ప్రభుత్వం పీఎస్‌యూ చమురు కంపెనీలను కోరుతోంది. విత్త పరిస్థితులు బాగాలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తం చెల్లించాలని ప్రభుత్వం కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మొత్తంలో 60 శాతాన్ని చమురు కంపెనీల్లో పెద్దన్నలైన ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయిల్‌ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే కంపెనీల లాభాలు తగ్గినా, కంపెనీల్లో ప్రభుత్వ వాటాలు తగ్గినా.. తమకు మాత్రం అధిక డివిడెండ్‌ ఇవ్వక తప్పదని ఆర్థిక శాఖ కోరుతున్నట్లు చమురు కంపెనీల వర్గాలు తెలిపాయి. తాజా డిమాండ్‌ ప్రకారం ఓఎన్‌జీసీ రూ. 6500 కోట్లు, ఐఓసీ రూ.5500 కోట్లు, బీపీసీఎల్‌ రూ. 2500 కోట్లు, గెయిల్‌ రూ.2వేల కోట్లు, ఓఐసీ రూ. 1500 కోట్లు, ఈఐఎల్‌ రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్లు తెలిసింది.


కంపెనీల వ్యతిరేకత
మరింత డివిడెండ్‌ ఇవ్వాలన్న ప్రభుత్వ డిమాండ్‌ను చమురు కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ విషయమై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ డిమాండ్‌ కన్నా తక్కువ డివిడెండ్‌నే కంపెనీలు ఇచ్చే అవకాశమున్నట్లు తెలిపాయి. ప్రభుత్వం కోరినంత సొమ్ము ఇవ్వాలంటే అప్పులు చేయాల్సిఉంటుందని కంపెనీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తమ లాభాలతో సంబంధంలేనంత మొత్తాలు ప్రభుత్వం కోరుతోందని కంపెనీల ప్రతినిధులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈఐఎల్‌ మినహా ఇతర కంపెనీలన్నీ లాభాల్లో క్షీణత నమోదు చేశాయి. ఇలాంటప్పుడు అధిక డివిడెండ్‌ ఇవ్వాలంటే తమ ప్రణాళికలు భగ్నం చేసుకోవానలి, లేదా అప్పులు తెచ్చి వ్యయాల భారం పెంచుకోవాలని కంపెనీలు వాపోతున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం కొంత అప్పు తెచ్చైనా మంచి డివిడెండ్‌ ఇ‍వ్వడం తప్పేమీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. 



You may be interested

జనవరిలో మిడ్‌ క్యాప్స్‌ జోరు

Wednesday 15th January 2020

కొత్త ఏడాది(2020)లో అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే మధ్య, చిన్నతరహా కౌంటర్లు జోరు చూపుతున్నాయి. ఓవైపు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతుంటే.. మరోవైపు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఇన్వెస్టర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ జనవరిలో ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 1.6 శాతం పుంజుకోగా.. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 3 శాతం, స్మాల్‌ క్యాప్‌ 5 శాతం చొప్పున ఎగశాయి. ఇతర వివరాలు

బంగారానికి మళ్లీ కొనుగోళ్ల మద్దతు

Wednesday 15th January 2020

రెండురోజుల వరుస నష్టాల ముగింపు తర్వాత బంగారం ధరకు తిరిగి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎంసీఎక్స్‌లో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 10గ్రాములు బంగారం ధర రూ.227.00ల లాభంతో రూ.39674.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వారం రోజుల కనిష్టస్థాయి నుంచి రికవరీ కావడం,  దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారక విలువ 14పైసల నష్టంతో ప్రారంభం కావడం లాంటి అంశాలు బంగారానికి డిమాండ్‌ పెంచాయి. అమెరికా

Most from this category