News


బంగారం ధర మరింత తగ్గుతుందా?

Saturday 9th November 2019
Markets_main1573276930.png-29472

బంగారం ధరలు గత కొద్దిరోజుల నుంచి 1,520-1,485 డాలర్ల శ్రేణిలో కదులుతున్నాయి. గోల్డ్‌ బుల్స్‌ తదుపరి ర్యాలీ కోసం వేచి చూస్తున్నప్పటికి యుఎస్‌-చైనా మధ్య ట్రేడ్‌వార్‌ ముగిసే సూచనలు కన్పిస్తుండటంతో, ఈ ర్యాలీ ఆలస్యమవుతోంది. అయినప్పటికీ ప్రస్తుతం బంగారం ధరలు వాటి 200 డీఎంఏ స్థాయికి చాలా ఎగువనే ట్రేడవుతున్నాయి. కానీ యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ముగిస్తే బంగారం ధరలు పడిపోడానికి అవకాశం ఉంది. డాలర్‌ బలహీనంగా ఉన్నప్పటికి, యుఎస్‌ ఆర్థిక డేటా బలంగా ఉండడం, వాణిజ్య ఒత్తిళ్లు తగ్గడంతో, అక్టోబర్‌ నెలలో బంగారం ధరలు ఒక పరిధిలో ట్రేడయ్యాయి. మొత్తంగా రోజువారి చార్టును పరిశీలిస్తే.. ప్రస్తుతం బంగారం ధరలు వాటి 200 డీఎంఏ స్థాయికి చాలా పైన ట్రేడవుతున్నాయి. కానీ తాజా పరిణామాల వలన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గతంలో బంగారం ధరలు పడుతూ వస్తున్నప్పుడు వాటి 200 డీఎంఏ స్థాయిని పరీక్షించిన కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని విశ్లేషకులు సలహాయిచ్చారు.  
   గతంలో ప్రతి సారీ పైనుంచి ఎక్కువశాతం తగ్గిపుడల్లా  200 డీఎంఏ స్థాయిని పరీక్షించడం, ఆ స్థాయిని కోల్పోయాక, బంగారం ఆ స్థాయిని కొంత అంతరంతో తిరిగి అందుకోవడం జరిగింది. బంగారం ధరలు 2017 జులైలో వాటి 200 డీఎంఏ స్థాయి దిగువకు పడిపోగా, 2017 సెప్టెంబర్‌లో(రెండు నెలల తర్వాత) తిరిగి ఆ స్థాయిని చేరుకుంది. అదేవిధంగా 2018 జనవరిలో 200 డీఎంఏ స్థాయికి దిగువన పడిపోగా, ఐదు నెలల తర్వాత తిరిగి(మే 2018) ఆ స్థాయిని అందుకొంది.  2018 జులైలో మరోసారి ఈ స్థాయి దిగువకు పడిపోగా, 2018 నవంబర్‌లో(నాలుగు నెలల తర్వాత) తిరిగి 200 డీఎంఏ స్థాయి దాటింది. ఈ ఏడాది జనవరిలో కూడా బంగారం ధరలు 200 డీఎంఏ స్థాయిని కోల్పోయాయి. కానీ తిరిగి రెండునెలల తర్వాత(2019 మార్చి) ఆ స్థాయిని అందుకున్నాయి. 
   ‘బంగారం ధరలు ప్రస్తుతం వాటి 200 డీఎంఏకు చాలా ఎగువన ట్రేడవుతున్నాయి. గత నాలుగు నెలల నుంచి అదే స్థాయిలో ఉన్నాయి. దాదాపు ప్రతీ ఐదు నెలలకూ ఓ దఫా పుత్తడి ధర 200 డీఎంఏ స్థాయిని పరీక్షిస్తున్నట్లు పైన ప్రస్తావించిన డేటా వెల్లడిస్తోంది. అందుచేత వచ్చే నెల కల్లా 200 డీఎంఏ స్థాయిని పరీక్షించడం మనం చూడవచ్చు. ఆర్‌ఎస్‌ఐ, 200 డీఎంఏ వంటి ఆస్కిలేటర్స్‌ ప్రకారం బంగారం ర్యాలీ అధికంగా జరిగిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎదురయిన ప్రతిసారి, మార్కెట్‌ ఓవర్‌బాట్‌ లేదా ఓవర్‌ సోల్డ్‌కు గురయ్యిందని, బేర్స్‌ లేదా బుల్స్‌ ఆదిపత్యం చూపే అవకాశం ఉందనే సంకేతాన్ని టెక్నికల్‌ ట్రేడర్లకు ఇస్తోంది. అందువలన మరో సారి పసిడి 200 డీఎంఏ స్థాయిని పరీక్షించవచ్చనే ఉద్దేశ్యంతో ట్రేడర్లు 
లాభాలను తీసుకోవడం లేదా మూవింగ్‌ యావరేజ్‌, ధరలకు మధ్య అంతరం వచ్చినప్పుడు పూర్తిగా అమ్మేయడం చేస్తున్నారు’ అని సాంకేతిక విశ్లేషకులు తెలిపారు.



You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 9th November 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ప్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11945.35 తో పోలిస్తే 5పాయింట్ల లాభంతో 11,950.50 వద్ద స్థిరపడింది. భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను మూడీస్‌ తగ్గించడంతో పాటు సూచీల లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో  రెండు రోజుల రికార్డ్‌ ముంగింపు లాభాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 330 పాయింట్ల నష్టంతో 40,324 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు పతనమై

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం రూ.737 కోట్లు

Saturday 9th November 2019

73 శాతం అప్‌ రూ.22,098 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.737 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.425 కోట్ల నికర లాభం ఆర్జించామని, 73 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,430 కోట్ల నుంచి రూ.22,098 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బ్యాంక్‌ వెల్లడించిన

Most from this category