News


స్థిరంగా పసిడి ధర

Thursday 12th September 2019
Markets_main1568269224.png-28333

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ద ఉద్రికత్తలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం, నేడు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సమావేశం జరుగున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం పసిడి స్థిరమైన ట్రేడింగ్‌కు కారణమవుతున్నాయి. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ ఆరువారాల గరిష్టం వద్ద కదలాడుతుండటం సైతం  పసిడి ర్యాలీకి అడ్డంకిగా మారింది. నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.65డాలరు పెరిగి 1,504.85 డాలర్‌ వద్ద ట్రేడ్‌ అవుతోం‍ది. వాణిజ్య చర్చల్లో భాగంగా 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాల విధింపును అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 15 తేదికి పొడిగించడానికి అమెరికా బుధవారం అంగీకరించింది. దీంతో ఇన్వెస్టర్లు తన పెట్టుబడులను రిస్క్‌ అసెట్‌గా భావించే ఈక్విటీ మార్కెట్లపై మళ్లిస్తున్నారు. నేడు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సమావేశం జరుగుతుంది. బ్రెగ్జిట్‌ ఆందోళనలతో మం‍దగించిన యూరోజోన్‌ ఆర్థికవ్యవస్థకు మద్దతగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఎలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటిస్తుందో అని ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాగే వచ్చేవారంలో జరగనున్న అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ సమావేశం కోసం కూడా ఎదురుచూస్తున్నారు. అగ్రరాజ్యాలు బలమైన ఆర్థిక గణాంకాలు విడుదల చేయడటంతో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో సెప్టెంబర్‌ 4వ తేదిన ఆరేళ్ల గరిష్టాన్ని తాకిన నుంచి నేటివరకు పసిడి ధర 4శాతం క్షీణించాయి. 
దేశీయంగా రూ.38000 దిగువకు పసిడి ధర:- 
ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి వరుసగా బలపడటంతో దేశీయంగా పసిడి ధర రూ.38000 దిగువకు వచ్చింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లాభపడటం, చైనా యువాన్‌ వంటి ఆసియా కరెన్సీలు పుంజుకోవడంతో 5 రోజుల్లో 73 పైసలు లాభపడింది. నేడు ఉదయం ట్రేడింగ్‌లో మరో 30పైసలు బలపడింది. రూపాయి ర్యాలీతో పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. ఫలితంగా నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో  అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి రూ.498లు నష్టపోయి 38000 స్థాయిని కోల్పోయి రూ.37974 వద్ద స్థిరపడ్డాయి. నేటి ఉదయం ట్రేడింగ్‌లో రూ.50ల నష్టపోయి రూ.37932.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

పోస్టాఫీస్‌ డిపాజిట్లకు పెరుగుతున్న డిమాండ్‌

Thursday 12th September 2019

ఇటీవల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పోస్టాఫీస్‌ డిపాజిట్లు, ప్రభుత్వబాండ్ల వైపు మళ్లిస్తున్నారు. బ్యాంకుల  పిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు 7శాతానికి దిగువకు చేరుకోవడం ఇందుకు కారణమవుతోంది. రానున్న రోజుల్లో వడ్డీరేట్లు మరింత తగ్గవచ్చనే అంచనాలతో పెట్టుబడిదారులు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలకు బదులుగా ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. అగ్ర బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లపై సరాసరి అరశాతం నుంచి 1శాతం మేర కోత విధించడంతో 6.5-7.1 శాతానికి పరిమితయ్యాయి. ఇదేకాలంలో పోస్టాఫీస్‌ డిపాజిట్లు, ప్రభుత్వబాండ్లపై

నిఫ్టీ 11,042ను దాటింది... తర్వాత ఎటు?

Thursday 12th September 2019

స్టాక్‌ మార్కెట్లు ఈ వారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 11,000 స్థాయికి పైన ప్రారంభమవ్వగా, ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ తన 5, 13, 20-రోజుల ఈఎంఏ(ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజ్‌) సగటుల కంటే పైన ట్రేడవుతోంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.97 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.92 శాతం పెరిగాయి. నిఫ్టీ 50 తన కీలక నిరోధ స్థాయి

Most from this category