News


రూ.41వేల పైకి బంగారం ధర

Wednesday 25th March 2020
Markets_main1585120521.png-32669

బంగారం ధర వరుసగా మూడో రోజూ పెరిగింది. గత వారంలో భారీగా పడిపోయిన బంగారం ధర వరుస 3రోజుల ర్యాలీతో తిరిగి రూ.41వేల మార్కును అందుకుంది. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తూ ఆర్థిక వ్యస్థలను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థనలు బలోపేతం చేసేందుకు అమెరికాతో పాటు వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు ఉద్దీపనలు ప్రకటింస్తుండటంతో బంగారం «ధర బుధవారం లాభపడింది. దేశీయం మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటి ధరతో పోలిస్తే రూ. 200 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.41,500.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం 6 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,664.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఎల్‌అండ్‌టీ డీలా- కేపిటల్‌ గూడ్స్‌ వీక్‌

Wednesday 25th March 2020

కేపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 6 ఏళ్ల కనిష్టం రెండు నెలల్లో ఎల్‌అండ్‌టీ 46 డౌన్‌ 57-40 శాతం మధ్య పలు కౌంటర్లు బోర్లా మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో కదులుతున్నప్పటికీ కేపిటల్‌ గూడ్స్‌, ఇంజినీరింగ్‌ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో బీఎస్ఈలో కేపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ ఆరేళ్ల కనిష్టాన్ని తాకింది. కరోనా కల్లోలం కారణంగా 2008లో వెలుగుచూసిన సంక్షోభాన్ని మించి మౌలిక సదుపాయాల రంగం పెట్టుబడుల క్షీణతను చవిచూడనున్నట్లు విశ్లేషకులు అంచనా

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 10శాతం ర్యాలీ

Wednesday 25th March 2020

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ చర్చలు జరుపుతోందనే వార్తలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 10శాతం లాభపడింది. వాటా విక్రయవార్తలో రిలయన్స్‌ షేరు నేడు బీఎస్‌ఈలో మునుపటి ముగింపు(రూ.943.10)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.951.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో దాదాపు 10శాతం పెరిగి రూ.1000మార్కును అధిగమించి రూ.1035.00 వద్ద

Most from this category