News


3నెలల కనిష్టం వద్ద ముగిసిన పసిడి

Saturday 9th November 2019
Markets_main1573285238.png-29475

  • దేశీయంగా రూ.38వేల కిందకు ... 

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ ధర శుక్రవారం మూడునెలల కనిష్టం వద్ద స్థిరపడింది. అమెరికాలో గత రాత్రి డిసెంబర్‌ కాంటాక్టు ఔన్స్‌ పసిడి 3.50డాలర్లు నష్టపోయి 1,462.90డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా ‘‘మొదటి దశ ఒప్పందం’’ సఫలం దిశగా సాగుతుందనే ఆశావహన అంచనాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను తగ్గించాయి. నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర 1457డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని తాకింది. రిస్క్‌ అసెట్స్‌గా భావించే ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే అమెరికా ఈక్విటీ మార్కెట్లు జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. పసిడికి వ్యతిరేక దిశలో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్‌ సైతం 3వారాల గరిష్టానికి ఎగిసింది. ఈ అంశాలన్నీ పసిడి ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని టీడీ సెక్యూరిటీస్‌ స్ట్రాటజీస్ట్‌ రేయాన్‌ మెకాయ్‌ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో వాణిజ్య చర్చలు అంశం పసిడి ట్రేడింగ్‌కు దిశానిర్దేశం చేయనుంది. 
 

ఈ వారంలో పసిడి ధర 48.5 డాలర్లు(3.2శాతం) నష్టపోయింది. రెండేళ్ల అనంతరం పసిడి ధర ఒకవారంలో ఇంత స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికా ఈక్విటీ సూచీలు గరిష్టస్థాయిలను చేరుకోవడం, ట్రెజరీ ఈల్డ్‌ పెరగడం, డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం పసిడి ప్యూచర్లపై ఒత్తిడిని పెంచాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ వాణిజ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా మొదటి దశ ఒప్పందం ఖరారు అయ్యేందనే వార్తలు కూడా పసిడి డిమాండ్‌ను తగ్గించాయి.


దేశీయంగా రూ.38వేల దిగువన ముగింపు:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నష్టంతో ముగిసినప్పటికీ.., దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.112.00లు లాభపడి రూ.37687.00 వద్ద స్థిరపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 32పైసలు బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం నష్టాల ముగింపుతో దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచింది. వారం పరంగా చూస్తే రూ.377లు నష్టపోయింది. 



You may be interested

ఆందోళనలు తగ్గడంతోనే మార్కెట్‌ ర్యాలీ

Saturday 9th November 2019

-బీఎన్‌పీ పారిబా ఎండీ మనిషి రాయ్‌చౌదరి ‘అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలపై ఆందోళనలు తగ్గుతున్నాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం చూస్తున్నాం. ఇది ఇంకో రెండుమూడు నెలల వరకూ కొనసాగవచ్చు’ అని బీఎన్‌పీ పారిబా ఎండీ, ఈక్విటీ రిసెర్చ్‌ హెడ్‌ మనిషి రాయ్‌చౌదరి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్థిక వ్యవస్థ మెరుగుదల లేకుండానే షేర్లు పెరుగుతున్నాయ్‌... అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు గత నెల రోజులలో మంచి ర్యాలీ చేశాయి.

తాజా ర్యాలీతో మళ్లీ పెరిగిన వాల్యూషన్లు

Saturday 9th November 2019

జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ రెండు నెలలుగా మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ విస్తృతమైనదని, దీని కారణంగా తిరిగి మార్కెట్లలో వాల్యూషన్లు పెరిగిపోయాయని జియోజిత్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. తాజా ర్యాలీ దాదాపు అన్ని రకాల షేర్ల(లార్జ్‌, మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌)లో కనిపించిందన్నారు. నిఫ్టీ తదితర సూచీలు దాదాపు 11- 12 శాతం మేర రాణించాయని దీంతో వాల్యూషన్లు ప్రీమియం స్థాయిలకు చేరుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బ్లూచిప్స్‌, లార్జ్‌

Most from this category