News


రూ. 38,000 దిగువకు ఎంసీఎక్స్‌ గోల్డ్‌!

Saturday 12th October 2019
Markets_main1570865448.png-28843

  యుఎస్‌-చైనా మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరడంతో పాటు, బ్రెక్సిట్‌ పురోగతి సాధించడంతో బంగారం ధరలు శుక్రవారం నష్టపోయాయి. యుఎస్‌ గోల్డ్‌ ప్యూచర్స్‌ 0.50 శాతం పడిపోయి 1,489.80 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా దేశీయ ఎంసీఎక్స్‌ బంగారం 0.82 లేదా రూ. 314 నష్టపోయి రూ. 37845.00 వద్ద ముగిసింది. ‘యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం కుదరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా రిస్క్‌ ఉన్న ఆస్తులలో ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధపడుతన్నారు. ఇది బంగారం వంటి ఆస్తులకు ప్రతికూలమైనది’ అని జిమ్ వైకాఫ్, కిట్కో మెటల్స్‌ సీనియర్‌ విశ్లేషకుడు అన్నారు.

   యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం కుదరడంతో, వచ్చే వారం నుంచి అమలులోకి రానున్న చైనా దిగుమతులపై అదనపు సుంకాలను యుఎస్‌ నిలిపివేసింది. దీనితో పాటు బ్రెక్సిట్‌ పురోగతి కూడా బంగారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ‘బ్రిటన్‌, ఈయూ(యురోపియన్‌ యూనియన్‌) మధ్య బ్రెక్సిట్‌కి సంబంధించి కొంత పురోగతి జరిగింది. ఇది యురోపియన్‌ ఈక్విటీ మార్కెట్లు పెరగడానికి కారణమవుతోంది. ఈ అంశం కూడా బంగారం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది’ అని వైకాఫ్‌ అన్నారు. కాగా బ్రిటన్‌లో ఔన్సు బంగారం 2.5 శాతం పతనమయ్యి 1,168.35 పౌండ్లకు పడిపోయింది. ఈ అక్టోబర్ చివరి నాటికి ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చే అవకాశం ఉందని, ఐరిష్‌ ప్రధాని లియో వరద్కర్‌ తెలిపారు. ఏదిఎమైనప్పటికి ఇప్పటికి కూడా దీర్ఘకాలానికి గాను బంగారం బుల్లిష్‌గానే ఉందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ‘ట్రేడ్‌ డీల్‌ కుదరడంతో బంగారంలో అధికంగా అమ్మకాలు జరుగుతాయని నేను అనుకోవడం లేదు. దీర్ఘకాలానికి గాను బంగారం బుల్లిష్‌గానే ఉంది’ అని ఫారెక్స్‌.కామ్‌ మార్కెట్‌ విశ్లేషకులు ఫవాద్ రజాక్జాడా అన్నారు.  ‘డీల్‌ ఖరారయితే చైనా నుంచి గోల్డ్‌కు డిమాండ్‌ అధికమవుతుంది. చైనా ప్రపంచంలో అతి పెద్ద బంగారం వినియోగదారుడు గమనార్హం’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 



You may be interested

నిఫ్టీలో ర్యాలీ సంకేతాలు!

Saturday 12th October 2019

దేశీయ మార్కెట్లు ఈ వారం వివిధ విభాగాల్లో ట్రెండ్‌ రివర్సల్‌ చూశాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు క్రమంగా ఫలితాలు చూపుతున్నట్లు కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ చర్యలకు ఆర్‌బీఐ రేట్‌కట్‌ మూడ్‌ తోడవడంతో సెంటిమెంట్‌ క్రమంగా పాజిటివ్‌ దిశగా మరలుతోంది. ఇది సిప్‌ నిధుల ప్రవాహం పెరగడంలో వెల్లడవుతోంది. ఆగస్టులో రూ. 8200 కోట్ల నిధులు సిప్‌ రూపంలో ఈక్విటీల్లోకి వచ్చాయి. మరోవైపు ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ వేగం

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ...బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు డౌన్‌

Saturday 12th October 2019

శనివారం ఉదయం ట్రేడింగ్‌లో సింగపూర్‌ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాల్లో ట్రేడవుతోంది. శుక్రవారం నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపు 11318 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల నష్టంతో 11287 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఒకదశలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11359 పాయింట్ల గరిష్ఠాలను చేరినా అక్కడ నిలబడలేకపోయింది. శుక్రవారం ట్రేడ్‌ డీల్‌ వార్తలతో ప్రపంచ మార్కెట్లన్నీ కదం తొక్కాయి. దీంతో సోమవారం దేశీయ సూచీలు పాజిటివ్‌గా ఉంటాయని చాలామంది అంచనా వేశారు. కానీ ఎస్‌జీఎక్స్‌

Most from this category