News


దిగివచ్చిన పసిడి

Friday 13th September 2019
Markets_main1568354744.png-28350

ప్రపంచమార్కెట్లో పసిడి ధర దిగివచ్చింది. ఆసియాలో శుక్రవారం ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు నష్టపోయి 1,503.20 వద్ద స్థిరపడింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు పురోగతి సాధిస్తున్నట్లు సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు రిస్క్‌ అసెట్‌ సాధనమైన ఈక్విటీ షేర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ‘‘వచ్చే నెలలో అమెరికా చైనాల మధ్య  మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇప్పటికే శాంతి పూర్వక వాతావరణ నెలకొనడం శుభపరిణామం.ఇరుదేశాల మధ్య వేడిక్కిన వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు చల్లబడటంతో పసిడి దిగివస్తున్నాయి’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌ సుగంధ సచ్‌దేవ్‌ అభిప్రాయపడ్డారు. ట్రంప్ గురువారం చైనాతో సమగ్ర వాణిజ్య ఒప్పందానికి ప్రాధాన్యత ఇచ్చారని, అయితే "సులభమైన" ఒప్పందం సాధ్యం కాదని చెప్పినప్పటికీ, తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. అలాగే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఉద్దీపన చర్చల ప్రకటనతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లించారు. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు లాభాల ముగింపు నేపథ్యంలో అక్కడి ఔన్స్‌ పసిడి ధర 4.20డాలర్లు క్షీణించి 1,507.40 డాలర్ల వద్ద స్థిరపడింది. 
దేశీయంగానూ తగ్గుదలే :- 
దేశీయ మార్కెట్లో పసిడి ధర క్షీణించింది. రూపాయి ర్యాలీ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పతనం తదితర కారణాలు దేశీయ పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతున్నాయి. నేటి ఉదయం ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.64ల నష్టపోయి రూ.37686.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి వరుసగా ఆరోరోజూ ర్యాలీ చేయడంతో నిన్నరాత్రి పసిడి ధర రూ.224లు నష్టపోయి రూ.37,750 వద్ద స్థిరపడింది. 



You may be interested

నిఫ్టీ 10,850 స్థాయిని కోల్పోతే అమ్మకాల ఒత్తిడి

Friday 13th September 2019

వరుసగా ఐదు రోజుల లాభాలకు గురువారం సెషన్‌లో బ్రేక్‌ పడింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 166 పాయింట్లు కోల్పోయి 37,104 స్థాయికి, నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 10,981 స్థాయికి పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితులలో నిఫ్టీ కీలకమైన 10,850 స్థాయిని కొల్పోతే మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు. సాంకేతిక విశ్లేషణ: నిఫ్టీ 50 రోజువారి డైలీ చార్టులో బేరిష్‌ ఎంగల్‌ఫింగ్‌ నమూనాను ఏర్పాటు చేసిందని సాంకేతిక విశ్లేషకులు తెలిపారు. గత కొన్ని సెషన్‌ల

70.96 వద్ద ప్రారంభమైన రూపీ

Friday 13th September 2019

తాజాగా విదేశి నిధుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడం, చమురు ధరలు పడిపోవడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌ వార్‌ కొంత సరళతరం అవ్వడం, చైనా కరెన్సీ బలపడడం వంటి కారణాల వలన రూపీ డాలర్‌ మారకంలో గత కొన్ని సెషన్‌ల నుంచి బలపడుతోంది. రూపీ... డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 18 పైసలు బలపడి 70.96 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో డాలర్‌ మారకంలో  52 పైసలు బలపడి

Most from this category