News


ఈనెల్లోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌

Thursday 12th September 2019
news_main1568259232.png-28322

  • సెప్టెంబర్‌ 29న ప్రారంభం

న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ఈనెలాఖరులోనే మరోసారి 'ది బిగ్ బిలియన్ డేస్‌' సేల్ ఆఫర్‌ను ప్రారంభించనుంది. ఆరు రోజులపాటు కొనసాగే తాజా ఆఫర్‌.. సెప్టెంబర్‌ 29న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. గతంలో కంటే అధిక వస్తువులను ఈసారి ఆఫర్‌లో ఉంచనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఇందుకోసం అనేక బ్రాండ్లు, ఎంఎస్‌ఎంఈ, విక్రయదారులతో ఇప్పటికే ఒప్పందంకుదిరినట్లు తెలియజేసింది. సుమారు 30,000 కిరాణా స్టోర్లను అదనంగా జతజేసింది. ఈ అంశంపై సంస్థ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘తాజా ఆఫర్‌ కోసం ఎంతో కాలంగా శ్రమించాం. పండుగల సీజన్‌లో అత్యంత వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు కావాల్సిన మొత్తం వ్యవస్థను సిద్ధంచేశాం. ఈసారి పండుగ కోసం.. దేశవ్యాప్తంగా ఉన్న అనేక వస్తువులను మా ప్లాట్‌ఫాం ద్వారా ఒకచోటకు చేర్చి వినియోగదారులకు అందించడం కోసం ఏడాది నుంచి ప్రణాళికలు రచిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.

కార్డ్‌ హోల్డర్లకు ప్రత్యేక ఆఫర్లు...
క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందించడంలో భాగంగా యాక్సిక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో ఒప్పందంకుదుర్చుకుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ కస్టమర్లకు అందరికంటే నాలుగు గంటల ముందు యాక్సిస్‌ ఉంటుందని ప్రకటించింది. 



You may be interested

ఫ్లిప్‌కార్ట్‌లో మాతృసంస్థ భారీ పెట్టుబడి

Thursday 12th September 2019

సింగపూర్‌ సంస్థ నుంచి రూ.1,616 కోట్లు వాల్‌మార్ట్‌కు చెందిన భారత ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ఈ పండుగల సీజన్‌ కోసం తన మాతృసంస్థ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడిని అందుకుంది. సింగపూర్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలో రూ.1,616 కోట్లును పెట్టుబడిగా పెట్టినట్లు రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ)కి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఇందుకోసం భారత సంస్థ తనకు 4,64,403 ఈక్విటీ షేర్లను (ఒక్కో

ఎయిర్‌టెల్‌ ‘ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్’ సేవలు ప్రారంభం

Thursday 12th September 2019

1జీబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ధర రూ. 3,999 న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌..  ‘ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్’ పేరుతో అపరిమిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను బుధవారం ప్రారంభించింది. గృహాలు, ఎస్‌ఓహెచ్‌ఎం (స్మాల్ ఆఫీస్ హోమ్ ఆఫీస్), చిన్న వాణిజ్య సంస్థల కోసం రూ. 3,999 నెలవారీ చందాకే తాజా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, అహ్మదాబాద్, ఫరీదాబాద్, నోయిడా,

Most from this category