News


ఫైనాన్షియల్స్‌ భలే దూకుడు..

Thursday 26th March 2020
Markets_main1585278725.png-32686

ఇండస్‌ఇండ్‌.. 35 శాతం అప్‌
బ్యాంక్‌ నిఫ్టీ 8 శాతం ప్లస్‌

కొద్ది రోజులుగా ఏకధాటిగా క్షీణిస్తూ వస్తున్న ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి జోష్‌ వచ్చింది. దీతో ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్ రంగ బ్యాంక్స్‌ 10 శాతం పురోగమించాయి. బ్యాంక్‌ నిఫ్టీ 8 శాతం ఎగసింది. గత మూడు వారాలుగా 42 శాతం క్షీణించిన ఫైనాన్షియల్‌ రంగం మూడు రోజులుగా టర్న్‌అరౌండ్‌ బాట పట్టింది. 15-20 శాతం మధ్య రికవరీ సాధించింది. కరోనా కల్లోలాన్ని సమర్దవంతంగా ఎదుర్కొనే బాటలో ప్రభుత్వం 8-10 కోట్ల పేదలకు ప్యాకేజీ ప్రకటించనున్న అంచనాలు ఇందుకు సహకరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..

ఇండస్‌ఇండ్‌ జోరు
ఇటీవల నిరవధిక పతనాన్ని చవిచూస్తున్న ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కౌంటర్‌ ఉన్నట్టుండి జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఏకంగా 40 శాతం దూసుకెళ్లింది. ఇది రికార్డ్‌కాగా.. రూ. 422 వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా 8 రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. అయినప్పటికీ ఈ షేరు మార్చిలో 66 శాతం దిగజారడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు తెలియజేశారు. ఈ బాటలో ఇతర ప్రయివేట్ రంగ బ్యాంక్‌ కౌంటర్లు బంధన్‌ 33 శాతం జంప్‌చేసి రూ. 52ను తాకగా.. సీయూబీ 12 శాతం పెరిగి రూ. 148కు చేరింది. 

జోరు తీరిలా
ఇతర బ్యాంక్‌ కౌంటర్లలో యాక్సిస్‌, ఐసీఐసీఐ 10 శాతం చొప్పున జంప్‌ చేశాయి. యాక్సిస్‌ రూ. 360 వద్ద, ఐసీఐసీఐ రూ. 350 వద్ద ట్రేడవుతున్నాయి.  ఇదే విధంగా ఫెడరల్‌, ఆర్‌బీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, కొటక్ మహీంద్రా,  స్టేట్‌ బ్యాంక్‌ 8-2 శాతం మధ్య పెరిగి ట్రేడవుతున్నాయి. 



You may be interested

10శాతం పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Thursday 26th March 2020

మోర్గాన్‌ స్టాన్లీ టార్గెట్‌ ధర పెంపు గడిచిన మూడు రోజులుగా భారీ పతనాన్ని చవిచూసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో ఏకంగా 10శాతం లాభపడింది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఈ హెవీవెయిట్‌ షేరు ఫిబ్రవరి 1 నుంచి ఏకంగా 30శాతం నష్టాన్ని చవిచూసింది. ఇంత స్థాయిలో పతనమైనప్పటికి ఈ షేరుపై పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఇప్పటికీ బుల్లిష్‌ ధృక్పథాన్ని కలిగి ఉన్నాయి.  నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ.874.50 వద్ద

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 26th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇండియా సిమెంట్‌: ఎవెన్యూ సూపర్‌ మార్ట్‌ అధినేత రాధాకృష్ణ దమానీ ఇండియా సిమెంట్‌లోని ఒక్కో షేరును రూ.94.97 చొప్పున 16 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఇండియా సిమెంట్‌లోని 4 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సోమవారమే ప్రకటించారు. రియలన్స్‌ ఇండస్ట్రీస్‌: ప్రమోటర్‌ దేవర్షీ కమర్షియల్‌ ఎల్‌ఎల్‌పీ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా రూ.11,000 కోట్ల షేర్లనుఅమ్మగా దానిని సమర్జిత్‌

Most from this category