News


ఇంకొక్కసారి పెంచిన తర్వాత విరామం!?

Saturday 16th March 2019
news_main1552734465.png-24647

ఫెడ్‌ వడ్డీరేట్ల పాలసీపై నిపుణుల అంచనా
గతంలో చెప్పినట్లు ఒక్కనెల కాకుండా మరికొంత కాలం ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచకపోవచ్చని, మూడో త్రైమాసికం వరకు వేచిచూడవచ్చని పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యు3లో ఒకసారి రేట్లు పెంచినతర్వాత మరలా వేచిచూసే ధోరణిని అవలంబిస్తుందని రాయిటర్స్‌ పోల్‌లో పలువురు భావించారు. దాదాపు 100 మంది అనలిస్టులు ఈ పోల్‌లో పాల్గొన్నారు. ఫెడ్‌ చైర్మన్‌ సైతం రేట్ల పెంపునకు తాము ఎలాంటి తొందరపడడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక మందగమన భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫెడ్‌ రేట్లను పెంచడంపై స్పీడవకపోవచ్చని యూనిక్రెడిట్‌ ముఖ్య సలహాదారు హామ్‌ బాండ్‌హోల్జ్‌ అభిప్రాయపడ్డారు. జూన్‌లో లేదా జూన్‌ తర్వాత మాత్రం ఒకదఫా రేట్లు పెంచేందుకు అవకాశాలున్నాయన్నారు. మార్చి మీటింగ్‌లో మాత్రం రేట్ల పెంపు నిర్ణయం ఉండదని పోల్‌లో పాల్గొన్న ఎకనమిస్టులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. 55 శాతం మంది సెప్టెంబర్‌లో రేట్‌ పెంపు ఉంటుందని భావించారు. ఈ దఫా ఎప్పటిలాగే 25 బీపీఎస్‌ పెంపుదల ఉంటుందని అనలిస్టుల సరాసరి అంచనా. ఇదే తరహా పోల్‌ను గత నెల నిర్వహించగా, రెండో త్రైమాసికంలో రేట్‌పెంపు ఉంటుందని ఎక్కువమంది అభిప్రాయపడగా, ఈ నెల పోల్‌లో గడువును క్యు3కి పెంచారు. కొందరు అనలిస్టులైతే అసలీఏడాదిలోనే రేట్ల పెంపు నిర్ణయం ఉండకపోవచ్చని తాజాపోల్‌లో తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది చివరినాటికి ఫెడ్‌ తిరిగి రేట్ల తగ్గింపు చేపట్టవచ్చని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. కొందరైతే ఈ ఏడాది క్యు3లో రేట్‌ పెంపుదల బదులు రేట్‌ కట్‌ నిర్ణయం రావచ్చని అభిప్రాయపడ్డారు. ఇక గత నెల పోల్‌లో అభిప్రాయపడ్డట్లే 25 శాతం మంది అనలిస్టులు వచ్చే ఏడాది కల్లా మాంద్యం రావచ్చని అంచనా వేశారు. వచ్చే రెండేళ్లలో మాంద్యం వస్తుందని 40 శాతం మంది భావించారు. 



You may be interested

1300డాలర్లపైన ముగింపు

Saturday 16th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 1300 డాలర్ల పైన ముగిసింది. చైనా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోతుందని ఆర్థికవేత్తలు అంచనాలతో పాటు, అమెరికా ఉద్యోగ గణాంకాలు, తయారీ రంగ గణాంకాలు మార్కెట్‌ వర్గాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడం పసిడి ర్యాలీకి కలిసొచ్చాయి. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి ఔన్స్‌ పసిడి ధర 7.15డాలర్లు పెరిగి 1,302.25డాలర్ల వద్ద ముగిసింది. న్యూజిలాండ్‌ మసీదులో అగంతకుడి కాల్పులతో 40 మంది

ఇండియాలోకి టెస్లా!

Saturday 16th March 2019

ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది పక్కా ఎలన్‌మస్క్‌ ప్రపంచ ప్రఖ్యాత టెస్లా కంపెనీని ఇండియాలో కూడా విస్తరిస్తామని ఎలన్‌ మస్క్‌ చెప్పారు. ఈఏడాదే ఇండియాలోకి వచ్చేందుకు యత్నిస్తామని, కుదరకపోతే వచ్చే ఏడాది తప్పకవస్తామని టెస్లా సీఈఓ ట్విటర్‌లో చెప్పారు. భారత్‌లో కాలుమోపేందుకు టెస్లా గతంలో యత్నించింది. అయితే ఇక్కడి విధాన పాలసీలు కఠినంగా ఉన్నాయని గతేడాది మస్క్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు మస్క్‌ను ఒప్పించాలని మోదీ ప్రభుత్వం చాలాయత్నాలు

Most from this category