News


ఐఐసీటీ ఎన్‌ఎంఆర్‌ వ్యవస్థకు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

Wednesday 4th December 2019
news_main1575432526.png-30044

యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ (ఐఐసీటీ) టెక్నాలజీలోని న్యూక్లియర్‌ మాగ్నెటిక్‌ రెజొనెన్స్‌ కేంద్రం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తనిఖీలను  విజయవంతంగా అధిగమించింది. ఈ మేరకు ఐఐసీటీ మంగళవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఫార్మా మందులతోపాటు రసాయనాల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఈ న్యూక్లియర్‌ మాగ్నెటిక్‌ రెజొనెన్స్‌ స్పెక్ట్రోస్కొపీని ఉపయోగిస్తారన్నది తెలిసిందే. యూఎస్‌ ఎఫ్‌డీఏ ఈ కేంద్రాన్ని ఆగస్టు 21, 22 తేదీల్లో తనిఖీ చేసిందని, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నట్లు గుర్తించిందని ఆ ప్రకటనలో తెలిపారు.  ఇందుకు అనుగుణంగా ఈ కేంద్రానికి నో యాక‌్షన్‌ ఇనిషియేటెడ్‌ (ఎన్‌ఏఐ) వర్గీకరణను కేటాయించింది. ‘‘దేశంలో ఎన్‌ఏబీఎల్‌ అక్రిడిటేషన్‌ ఉన్న అతిపెద్ద ఎన్‌ఎంఆర్‌ వ్యవస్థల్లో ఐఐసీటీ ఒకటి. ఇందులో అత్యాధునిక హైఫీల్డ్‌ ఎన్‌ఎంఆర్‌ స్పెక్ట్రోమీటర్లను ఏర్పాటు చేశాం. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంతో ఇక్కడ నాణ్యమైన క్వాలిటీ అనలిటికల్స్‌, ఏపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ తెలిపారు. 



You may be interested

భారత్‌ రేటింగ్‌ యథాతధం!

Wednesday 4th December 2019

ఎస్‌అండ్‌పీ రేటింగ్‌ ఏజన్సీ భారత సావరిన్‌ రేటింగ్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజన్సీ ఎస్‌ అండ్‌ పీ తెలిపిందని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతను చక్రవర్తి చెప్పారు. ఇటీవలే మూడీస్‌ సంస్థ భారత అవుట్‌లుక్‌ను స్టేబుల్‌ నుంచి నెగిటివ్‌కు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్‌అండ్‌పీ మాత్రం భారత్‌కు ఇచ్చిన బీబీబీమైనస్‌ రేటింగ్‌ను స్థిర అవుట్‌లుక్‌తో కొనసాగిస్తున్నట్లు తెలిపిందని చక్రవర్తి చెప్పారు. భారత్‌ దీర్ఘకాలిక వృద్ధిని సాధించగలదని ఎస్‌అండ్‌బీ

నష్టాలతో ప్రారంభం

Wednesday 4th December 2019

చైనాతో తమ ట్రేడ్‌ డీల్‌ బాగా జాప్యం కావొచ్చంటూ అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాల నడుమ, బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70 పాయింట్ల నష్టంతో 40,606 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11,970 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category