అధిక వాల్యూషన్లు.. అయినా పర్లేదు!
By Sakshi

హై పీఈ స్టాకుల్లో అధిక కొనుగోళ్లు
సాధారణంగా ఒక షేరును కొనేముందు టెక్నికల్స్ అధ్యయనం చేసేవాళ్లు అల్ప పీఈ స్థాయి ఉన్న షేర్ల వైపు మొగ్గు చూపుతారు. పీఈ తక్కువగా ఉంటే వాల్యూషన్లు తక్కువగా ఉన్నట్లు భావిస్తారు. కానీ తాజా మార్కెట్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోందని నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం అధిక పీఈ స్టాకులను వేలం వెర్రిగా కొనుగోలు చేస్తున్నారు. పీఈ ఎక్కువగా ఉన్నా పట్టించుకోకుండా కొన్ని షేర్ల ధరలు తాజా కొనుగోళ్లతో నానాటికీ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం వీటి వాల్యూషన్లు ఎక్కువైనా, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వృద్ధి కనిపిస్తుందని, అప్పుడు వీటి వాల్యూషన్లకు తగ్గ న్యాయం జరుగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అందుకే వాల్యూషన్లతో సంబంధం లేకుండా కొంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డేటా పరిశీలిస్తే సరాసరి పీఈ 50 ఉన్న దాదాపు 32 కంపెనీల షేర్లు ఈ ఏడాదిలో దాదాపు 30- 125 శాతం పెరిగాయి.
ఉదాహరణకు ఇన్ఫోఎడ్జ్ పీఈ 84 వద్ద ఉంది. ఇది ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 75 శాతం ర్యాలీ జరిపింది. అబాట్ ఇండియా పీఈ 51.1 ఉండగా, షేరు ఏడాదిలో దాదాపు 68 శాతం దూసుకుపోయింది. బెర్గర్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ పీఈ వరుసగా 77, 48 ఉండగా ఇవి ఈ ఏడాది సుమారు 50 శాతం ర్యాలీ జరిపాయి. విర్ల్పూల్ఇండియా పీఈ 56.4 కాగా ఏడాదిలో సుమారు 56 శాతం పరుగు తీసింది. వీటితో పాటు బాటా ఇండియా, నెస్లె, వరుణ్ బెవరేజెస్, పీఐ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ఏయూఎం, ఆర్‌ఎన్‌ఏఎం, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్యాస్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు కూడా అధిక వాల్యూషన్లున్నా మంచి ర్యాలీ నమోదు చేశాయి. భవిష్యత్ వృద్దిపై పాజిటివ్ అంచనాలే ఈ పెరుగుదలకు కారణమని నిపుణుల భావన. కొత్త ఇన్వెస్టర్లు వీటిలో ప్రవేశించేముందు కొంత తగ్గే వరకు వేచిచూడడం మంచిదని సలహా ఇస్తున్నారు.
You may be interested
టాటామోటర్స్‌కు జేఎల్ఆర్ అమ్మకాల జోష్
Wednesday 4th December 20196.50శాతం ర్యాలీ చేసిన షేరు అమెరికాలో లాండ్ రోవర్ నవంబర్ మొత్తం అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించడంతో ...మాతృసంస్థ టాటా మోటర్స్ షేరు బుధవారం మిడ్‌సెషన్ కల్లా 6.50శాతం లాభపడింది. టాటామోటర్స్ అనుబంధ, బ్రిటన్ ఆధారిత కార్ల తయారీ సంస్థ జాగ్వర్ లాండ్ రోవర్ ఈ అక్టోబర్ అమ్మకాలతో పోలిస్తే ఈ నవంబర్‌లో 19.4శాతం వృద్ధిని సాధించింది. వార్షిక ప్రాతిపాదిన చూసినట్లైతే.. గతేడాది నవంబర్‌లో విక్రయించిన 11,744 యూనిట్లుతో పోలిస్తే
కోలుకున్న బ్యాంక్ నిఫ్టీ
Wednesday 4th December 2019మార్కెట్ ప్రారంభంలో నష్టాల్లో ట్రేడైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మళ్లీ లాభాల బాట పట్టింది. నేడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 31,549.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం సెషన్లో మార్కెట్లో నెలకొన్న అమ్మకాలతో 169 పాయింట్ల మేర నష్టపోయి 31,444.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అనంతరం ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్ ఇంట్రాడే కనిష్టస్థాయి 31,444.00 నుంచి 434 పాయింట్లు లాభపడి 31,878.35