News


ఈసీబీ తాజా ఉద్దీపన

Friday 13th September 2019
news_main1568348503.png-28343

  • 22 బిలియన్‌ డాలర్ల 
  • విలువైన బాండ్ల కొనుగోలు
  • రివర్స్‌ డిపాజిట్‌ రేట్లు
  • మరింత కిందకు...

లండన్‌: ఆర్థిక పరిస్థితులను చక్రదిద్దే క్రమంలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) మరో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది. దీనిప్రకారం, నెలకు 20 బిలియన్‌ యూరోల (22 బిలియన్ల అమెరికా డాలర్లు) విలువైన బాండ్లను వ్యవస్థ నుంచి కొనుగోలు చేయనుంది. దీనితో ఆర్థిక వ్యవస్థలోకి ఈ మొత్తం వచ్చి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందన్నది సిద్దాంతం. ఇక ఇదే దిశలో వడ్డీరేట్లనూ మరింత మైనస్‌లోకి పంపింది. బ్యాంకింగ్‌ వడ్డీరేట్లు ప్రస్తుతం మైనస్‌ 0.4 శాతం ఉంటే, దీనిని మరింతగా మైనస్‌ 0.5 శాతానికి తగ్గించింది. దీనివల్ల బ్యాంకులో​డిపాజిట్లు వేస్తే, రివర్స్‌ వడ్డీరేట్లు మరింతగా కట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో బ్యాంకులో డిపాజిట్లు తగ్గి ఆ మేరకు మొత్తాలు ఆర్థిక ఉద్దీపనకు దోహదపడతాయని అంచనా. వచ్చే వారం అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కూడా వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న వార్తల నేపథ్యంలో యూరోజోన్‌లో తాజా ఉద్దీపన చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా వడ్డీరేట్లు తగ్గిస్తే, ఇది ఈ ఏడాది రెండవసారి అవుతుంది. ప్రపంచ వృద్ధి తగ్గుతుందన్న వార్తల నేపథ్యంలో పలు దేశాలు సరళతర ఆర్థిక విధానాలవైపు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. 



You may be interested

అమ్మకానికి దేనా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం

Friday 13th September 2019

రిజర్వ్‌ ప్రైస్‌ రూ. 530 కోట్లు ముంబై: దేనా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విక్రయించనుంది. ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని హెడ్‌ క్వార్టర్స్‌ను విక్రయించడానికి రూ. 530 కోట్లు రిజర్వ్‌ ప్రైస్‌ నిర్ణయించింది. అమ్మకం, వేలం కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. వార్తాపత్రికలలో గురువారం ప్రచురించిన ఆఫర్ పత్రం ప్రకారం.. ఈ-వేలం ద్వారా కార్యాలయాన్ని విక్రయానికి ఉంచనున్నట్లు స్పష్టమైంది. అక్టోబర్‌ 18న వేలం నిర్వహించనుంది. కదిలించగలిగే ఫర్నిచర్, ఫిక్ఛర్స్‌

26, 27 సమ్మెచేస్తాం

Friday 13th September 2019

 బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్ల నోటీస్‌ నవంబర్‌ రెండవ వారంలో నిరవధిక సమ్మెకూ హెచ్చరిక న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో విలీనాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో రెండు రోజులు సమ్మె చేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్లు నాలుగు హెచ్చరించాయి. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగుగా మార్చుతూ  విలీన పర్వానికి ఆగస్టు 30వ తేదీన  కేంద్రం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తాజా సమ్మె హెచ్చరిక వెలువడింది. ఇండియన్‌ బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్లు  ఒక

Most from this category