News


ఉద్యోగులను తొలగించొద్దు.. వేతనాల్లో కోత పెట్టొద్దు

Wednesday 25th March 2020
news_main1585114712.png-32667

  • పరిశ్రమలకు నిపుణుల సూచన

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర స్థాయిలో ఆర్థిక మందగమనం ముప్పు నేపథ్యంలో కంపెనీలు మానవీయ కోణంలో నడవాలని, ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాలను కోత విధించడం చేయరాదని నిపుణులు సూచించారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో,  ముఖ్యంగా తయారీ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడడం వల్ల, వాటిల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన కార్మికులకు ఉపాధి కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఉద్యోగుల భద్రతకు తమది పూచీ అంటూ, వారిని ఉద్యోగాల నుంచి తీసివేయకుండా దేశీయ పరిశ్రమలు సందేశం పంపించాల్సిన తరుణమిది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఉద్యోగుల వేతన వ్యయాలను తగ్గించుకోకుండా చూడొచ్చని సూచించారు. కాగా, అంతర్జాతీయంగా మాంద్యం అవకాశాలు పెరగడం, రవాణాపై ఆంక్షలు, సామాజిక అంతరం చర్యలతో భారత్‌లో పరిస్థితి భయానకంగా ఉందని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. 2020లో మొదటి రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొంది.  



You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 10శాతం ర్యాలీ

Wednesday 25th March 2020

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ చర్చలు జరుపుతోందనే వార్తలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 10శాతం లాభపడింది. వాటా విక్రయవార్తలో రిలయన్స్‌ షేరు నేడు బీఎస్‌ఈలో మునుపటి ముగింపు(రూ.943.10)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.951.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో దాదాపు 10శాతం పెరిగి రూ.1000మార్కును అధిగమించి రూ.1035.00 వద్ద

అమెజాన్‌ సేవలకు అంతరాయం

Wednesday 25th March 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న కారణంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తుల పంపిణీని ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా నిలిపివేసింది. గృహ అవసరాలకు అవసరమైన అధిక ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తులను మాత్రమే డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు హ్యాండ్‌ శానిటైజర్లు, పరిశుభ్రతకు అవసరమైన వస్తువులతో పాటు పలు ప్యాకేజీ ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల సరఫరా చేస్తోంది. ఇందుకు అనుగుణంగా సప్లై చైన్‌ నిర్వహణలో

Most from this category