STOCKS

News


సంపదలో భళా.. డీమార్ట్‌ దమానీ

Friday 14th February 2020
Markets_main1581666341.png-31794

కుబేర జాబితాలో ఐదో ర్యాంకు
రూ. 1.6 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ
రూ. 2560 వద్ద సరికొత్త గరిష్టానికి షేరు

డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ తాజాగా సంపదలో మరో మెట్టు ఎక్కారు. ఈ వారం మొదట్లో దేశీ కుబేరుల్లో ఆరో ర్యాంకును సాధించిన రాధాకిషన్‌ ప్రస్తుతం ఐదో స్థానాన్ని ఆక్రమిస్తున్నారు. డీమార్ట్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌​ షేరు ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. గురువారం ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 2560 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. తద్వారా కంపెనీ మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) రూ. 1.6 లక్షల కోట్లను అధిగమించింది. దీంతో రాధాకిషన్‌ సంపద సైతం 13.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. వెరసి 13.1 బిలియన్‌ డాలర్ల సంపద కలిగిన లక్ష్మీ మిట్టల్‌, 10.9 బిలియన్‌ డాలర్ల ఆస్తులుగల గౌతమ్‌ దమానీ, 9.62 బిలియన్‌ డాలర్ల సునీల్‌ మిట్టల్‌ తదితర వ్యక్తులను రాధాకిషన్‌ అధిగమించారు. కాగా.. ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌ గత కొద్ది రోజులుగా ర్యాలీ చేయడంతో ప్రస్తుతం వెనకడుగు వేస్తోంది. బీఎస్‌ఈలో మధ్యాహ్నం 1 ప్రాంతంలో 3.2 శాతం క్షీణించి రూ. 2462 వద్ద ట్రేడవుతోంది. తద్వారా కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ రూ. 1.6 లక్షల కోట్ల సమీపానికి చేరింది. ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

రూ. 3000 కోట్లు సమీకరణ
ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రమోటర్లు 1.48 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ వెల్లడించింది. ఇందుకు ఫ్లోర్‌ ధర రూ. 2049కాగా.. ఇది కంపెనీ ఈక్విటీలో 2.28 శాతం వాటాకు సమానమని తెలియజేసింది. వాటా విక్రయం ద్వారా ప్రమోటర్లు రూ. 3032 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు ఆఫర్‌ నేడు(14న) ప్రారంభంకానుండగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు 17న బిడ్డింగ్‌ వేసేందుకు వీలుంటుందని మార్కెట్‌వర్గాలు తెలియజేశాయి. 2017 మార్చి 21న లిస్టయిన కంపెనీ తొలుత రూ. 40,000 కోట్ల మార్కెట్‌ విలువను సాధించింది. తదుపరి పటిష్ట పనితీరు కారణంగా షేరు ధర పెరుగుతూ వచ్చింది. దీంతో తాజాగా కంపెనీ వీలువ రూ. 1.6 లక్షల కోట్లను తాకింది. కంపెనీ దేశవ్యాప్తంగా 196 డీమార్ట్‌ స్టోర్లను నిర్వహిస్తోంది. ప్రొడక్టులను చౌక ధరలలో విక్రయించడం​ద్వారా మార్కెట్లో విస్తరిస్తూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 



You may be interested

ఫేస్‌మాస్క్‌లకు భారీగా పెరిగిన డిమాండ్‌

Friday 14th February 2020

కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే మరికొన్ని లాభపడ్డాయి. వాటిలో శానిటైజర్స్‌, ఫేస్‌మాస్కులు విక్రయించే ఫ్మార్మా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో కోవిడ్‌-19 భయంతో అధిక సంఖ్యలో వినియోగదారులు ఫేస్‌మాస్కులు కొనుగోలు చేశారు. ఈ నాలుగు నగరాల్లో ఇప్పటికే ఫేస్‌మాస్క్‌లు నిల్వలు అయిపోయాయి. మరికొన్ని వారాల్లో శానిటైజర్స్‌ కూడా అయిపోతాయని చెబుతూ.. ‘‘ఆల్‌ ఫుడ్‌ అండ్‌

వొడాఐడియా... ఏ బ్యాంకుకు ఎంత బకాయి?

Friday 14th February 2020

బ్యాంకులకు, ప్రభుత్వానికి భారీ నష్టం శుక్రవారం టెల్కోలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌ బకాయిల గడువు పొడిగింపు కోరుతూ కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్స్‌ను తోసిపుచ్చింది. ఇంతవరకు ఏజీఆర్‌ బకాయిలు ఎందుకు వసూలు చేయలేదని డీఓటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టెలికం కంపెనీలు ముందు ఆదేశించిన విధంగా తప్పక ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏజీఆర్‌ బాకీలపై పునర్విచారణ, చెల్లింపుల సరళీకరణ జరగకపోతే కంపెనీ మూసుకుపోవడం తప్ప వేరే

Most from this category