News


సీబీఎస్‌ బ్యాంక్‌ లిస్టింగ్‌ సూపర్‌ సక్సెస్‌

Wednesday 4th December 2019
news_main1575442349.png-30049

గతవారం ఐపీఓ ఇష్యూను పూర్తి చేసుకున్న కేథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌(సీఎస్‌బీ) నేడు ఎక్చ్సేంజీల్లో భారీ లాభంతో లిస్ట్‌ అయ్యింది. ఇష్యూ ధర రూ.195తో పోలిస్తే 41శాతం లాభంతో రూ.275ల వద్ద లిస్టైంది. ఒకానొక దశలో ఇష్యూ ధర(రూ.195) కంటే 57శాతం వరకు పెరిగి రూ.307 స్థాయిని అందుకుంది. మధ్యాహ్నం గం. 12:00లకు ఇష్యూ ధరతో పోలిస్తే 53.50శాతం లాభంతో రూ.300 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఐపీఓ 22న ప్రారంభమై 28వ తేదిన ముగిసింది. 87 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. రూ.193–195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ సైజు రూ.410 కోట్లు. ఈ ఐపీఓలో భాగంగా మొత్తం 2.10 కోట్ల షేర్లను జారీ చేసింది. మొత్తం వంద కోట్ల షేర్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల(క్విబ్‌)లకు కేటాయించిన వాటా 62 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల(ఎన్‌ఐఐ) వాటా 165 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 44 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి.



You may be interested

కోలుకున్న బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 4th December 2019

మార్కెట్‌ ప్రారంభంలో నష్టాల్లో ట్రేడైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31,549.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం సెషన్‌లో మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాలతో 169 పాయింట్ల మేర నష్టపోయి 31,444.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అనంతరం ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి 31,444.00 నుంచి 434 పాయింట్లు లాభపడి 31,878.35

కొత్త ఆల్‌టైం హైకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Wednesday 4th December 2019

ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు బుధవారం ఉదయం సెషన్‌లో కొత్త జీవికాల గరిష్టాన్ని నమోదు చేసింది. బ్రోకరేజ్‌ సంస్థలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను పొడిగించడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.510.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. భవిష్యత్తులో బలమైన ఆదాయాలను ఆర్జించవచ్చనే అంచనాలతో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఈ షేరుపై గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను మరో 12నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మంగళవారం బ్రోకరేజ్‌ సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా

Most from this category