News


గ్యాస్‌ షేర్లపై క్రిడిట్‌సూసీ బుల్లిష్‌

Wednesday 15th January 2020
Markets_main1579087372.png-30954

వచ్చే పదేళ్ళలో భారత్‌లో బలమైన గ్యాస్ డిమాండ్ నెలకొంటుందనే అంచనాలతో అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రిడిట్‌సూసీ గ్యాస్‌ రంగానికి చెందిన షేర్లపై బుల్లిష్‌ దోరణి కనబరుస్తుంది. మహానగర్‌ గ్యాస్‌ షేరు షేరుకు బ్రోకరేజ్‌ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.1280లుగా కేటాయించింది. ఫలితంగా ఈ షేరు నేడు 6శాతానికి పైగా లాభపడింది. తక్కువ ఇన్‌పుట్‌ ధరలతో వచ్చే ఏడాది నుంచి కంపెనీ మార్జిన్లు పెరగవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. 

 క్రిడెట్‌ సూసీ... పెట్రోనెల్‌ ఎల్ఎన్‌జీ, గెయిల్‌ షేర్లకు సైతం ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. పెట్రోనెట్‌ ఎల్ఎన్‌జీ షేరు టార్గెట్‌ ధరను రూ.350గా నిర్ణయించడంతో పాటు పదేళ్లలో దాదాపు 26శాతం వరకు రాబడినివ్వవచ్చని అంచనా వేసింది. అలాగే గెయిల్‌ షేరుకు రూ.171 టార్గెట్‌ ధరను కేటాయించింది. గెయిల్‌ విషయంలో అధిక వ్యాల్యూమ్‌ వృద్ధితో ట్రాన్స్‌మిషన్స్‌, మార్కెటింగ్‌ విభాగాలు ప్రయోజనం పొందుతాయి. అయితే పెట్రోనెట్‌ విషయంలో.. బలమైన ఎల్ఎన్‌జీ దిగుమతులు దహేజ్ పూర్తి వినియోగంపైన,  కొచ్చి టెర్మినల్ అధిక వినియోగంపై ఆధారపడి ఉంటుందని క్రెడిట్ సూయిస్ చెప్పారు.

ఇదే బ్రోకరేజ్‌ సంస్థ గ్యాస్‌ రంగానికి చెందిన ఇంద్రప్రస్థగ్యాస్‌ టార్గెట్‌ ధరను రూ.410లుగా నిర్ణయించింది. న్యూట్రల్‌ రేటింగ్‌ను కేటాయించింది. గుజరాత్‌ గ్యాస్‌ షేరుకు సైతం న్యూట్రల్‌ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్‌ ధర రూ.240లుగా నిర్ణయించింది. నేడు ఇంద్రప్రస్థగ్యాస్‌  6శాతానికి పైగా ర్యాలీ చేయడంతో పాటు రూ.451వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అయితే పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, గెయిల్‌, గుజరాత్‌ గ్యాస్‌ షేర్లు మాత్రం స్వల్ప లాభంతో ముగిశాయి. 

ఇండియాలో గ్యాస్‌ డిమాండ్‌ పెరగడానికి బ్రోకరేజ్‌ సంస్థ ఈ కింది కారణాలను చూపుతుంది. 
1.అనేక క్రియారహిత ఎరువుల ప్లాంట్ల పునరుద్ధరణతో ఎరువుల రంగం నుండి అధిక డిమాండ్ ఏర్పడుతుంది. నాఫ్తా ఆధారిత మొక్కలను గ్యాస్-ఆధారితంగా మార్చడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుండటం. 
2.నగరాల్లో గ్యాస్ నెట్‌వర్క్‌లో గణనీయమైన విస్తరణ
3. తక్కువ స్పాట్ ఎల్‌ఎన్‌జీ ధరలు పారిశ్రామిక డిమాండ్ను పెంచుతాయి. 



You may be interested

నేడు నెగిటివ్‌ ఓపెనింగ్‌?!

Thursday 16th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు మైనస్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 20 పాయింట్ల  క్షీణించి 12,355 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,375 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కాగా.. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా

చివర్లో రికవరీ- నష్టాలు స్వల్పమే

Wednesday 15th January 2020

సెన్సెక్స్‌ తొలుత 300 పాయింట్లు డౌన్‌ 80 పాయింట్లవరకూ జారిన నిఫ్టీ చివరి అర్ధగంటలో ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ రికార్డు గరిష్టాల రెండు రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా నేడు అమెరికా, చైనా ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మా‍ర్కెట్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే చివరి అర్ధగంటలో నష్టాల నుంచి కోలుకున్నాయి. చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 80 పాయింట్లు క్షీణించి

Most from this category