News


25,200 కోట్ల డాలర్ల నష్టం

Wednesday 25th March 2020
news_main1585113668.png-32664

విమానయానంపై కోవిడ్‌ వైరస్‌ కాటు 
ప్రభుత్వాలు ఆదుకోవాలి: ఐఏటీఏ 

న్యూఢిల్లీ: కోవిడ్‌-19(కరోనా)వైరస్‌ కల్లోలం కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ప్రయాణీల ఆదాయంలో ఈ ఏడాది 25,200 కోట్ల డాలర్లు (19,15,200 కోట్లు)నష్టం వాటిల్లనున్నది. గత ఏడాది వచ్చిన ప్రయాణీకుల ఆదాయంలో ఇది దాదాపు 44 శాతానికి సమానం. 
కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో పలు దేశాలు విమాన సర్వీసులపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆంక్షలు మరో మూడు నెలలు కొనసాగితే, డిమాండ్‌ 38 శాతం తగ్గుతుందని ఐఏటీఏ(ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌) డైరెక్టర్‌ జనరల్‌ అలెగ్జాండర్‌ డి జూనియాక్‌ పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తగిన తోడ్పాటునందించాల్సిందిగా వివిధ దేశాల ప్రభుత్వాలను ఆయన కోరారు. 



You may be interested

మరిన్ని కంపెనీల ప్లాంట్ల మూసివేత

Wednesday 25th March 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోన్న నేపథ్యంలో పలు టైర్ల కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెలాఖరు వరకు ఉత్పత్తిని నిలిపివేసినట్లు అపోలో టైర్స్‌ మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. కేరళ, గుజరాత్, చెన్నై రాష్ట్రాల్లోని ప్లాంట్లలో మార్చి 31 వరకు కార్యకలాపాలను నిలుపుచేసినట్లు ప్రకటించింది. మరో టైర్ల ఉత్పత్తి సంస్థ సియట్‌ తమ ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలికంగా

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 25th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు రియలన్స్‌ ఇండస్ట్రీస్‌: భారతీయ అతిపెద్ద వైర్‌ లెస్‌ నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియో కంపెనీలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌  10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.   క్వెస్‌ కార్ప్‌ లిమిటెడ్‌: కోవిడ్‌ –19 సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుండటంతో కంపెనీ తన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేయనుంది. యస్‌బ్యాంక్‌: రేటింగ్‌ సంస్థ ఐసీఆర్‌ఏ

Most from this category