News


‘అప్పు’డే వద్దు..!

Saturday 12th October 2019
news_main1570854286.png-28838

- రుణాలు తీసుకోవడానికి వెనుకంజ...
 - సెప్టెంబర్‌లో రుణ వృద్ధి 8.79 శాతమే...
- సింగిల్‌ డిజిట్‌లోకి రావడం  ఈ ఏడాది ఇదే తొలిసారి

ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్‌ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్‌ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్‌ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ వృద్ధి రేటు సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

- 2019 సెప్టెంబర్‌ 27తో ముగిసిన పక్షానికి (అప్పటికి వార్షిక ప్రాతిపదికన చూస్తే) బ్యాంకింగ్‌ రుణాలు 97.71 లక్షల కోట్లు.
- 2018 ఇదే కాలానికి రుణాల పరిమాణం రూ.89.82 లక్షల కోట్లు. 
- అంటే వృద్ధి రేటు 8.79 శాతమన్నమాట. 
- వృద్ధి రేటు ఇలా 8.79 శాతం (సింగిల్‌ డిజిట్‌)గా చూడ్డం ఈ ఏడాది ఇదే తొలిసారి. 
- 2019 సెప్టెంబర్‌ 13 ముగిసిన పక్షం రోజులకు చూస్తే, రుణాల పరిమాణం రూ.97.01 లక్షల కోట్లుగా ఉంది. 2018 ఇదే కాలంలో పోల్చితే వృద్ధి రేటు 10.26 శాతంగా ఉంది. 

డిపాజిట్లూ మందగమనమే...
ఇక డిపాజిట్ల విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా వృద్ధిరేటు మందగమనంలోకి జారింది. 2019 సెప్టెంబర్‌ 27తో ముగిసిన పక్షం రోజులకు డిపాజిట్లు రూ. 129.06 లక్షల కోట్లు. 2018 ఇదే కాలానికి ఈ మొత్తం రూ.118 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 9.38 శాతంగా ఉంది. 2019 సెప్టెంబర్‌ 13తో ముగిసిన పక్షం రోజులకు చూస్తే, వృద్ధి రేటు 10.02 శాతంగా ఉంది. 

విభాగాల వారీగా రుణాలు...
- వ్యవసాయం, అనుబంధ విభాగాలకు రుణ వృద్ధి రేటు పెరిగింది. 2019 ఆగస్టులో 6.8 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 6.6 శాతంగా ఉంది. 
- పారిశ్రామిక విభాగానికి సంబంధించి కూడా రుణ వృద్ధి పెరగడం గమనార్హం. ఆగస్టులో ఈ రేటు 1.9 శాతం నుంచి (2018 ఆగస్టు) 3.9 శాతానికి (2019 ఆగస్టు) ఎగసింది. 
- 2018 ఆగస్టులో ఆహారేతర రంగానికి రుణ వృద్ధి రేటు 9.8 శాతంగా ఉంది. 2018 ఆగస్టులో ఈ రేటు 12.4 శాతం. 
- ఇదే నెలలో సేవల రంగానికి రుణ వృద్ధి రేటు 26.7 శాతం నుంచి 13.3 శాతానికి పడిపోయింది. 
- వ్యక్తిగత రుణ వృద్ధి రేటు కూడా 18.2 శాతం నుంచి 15.6 శాతానికి తగ్గింది. 



You may be interested

కోపరేటివ్‌ బ్యాంకుల నియంత్రణపై ఆర్‌బీఐ చర్చ

Saturday 12th October 2019

చండీగఢ్‌: పంజాబ్‌ అండ్‌ మహరాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకులో కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో... కోపరేటివ్‌ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థపై ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు శుక్రవారం చర్చించింది. కోపరేటివ్‌ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు సూచనలు చేసేందుకు గాను ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే చండీగఢ్‌లో ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సమావేశం జరిగింది.

ఎస్‌ఏపీకి సీఈవో మెక్‌డెర్మాట్‌ గుడ్‌బై

Saturday 12th October 2019

- నూతన సీఈవోగా జెన్నిఫర్‌మోర్గాన్‌ బెర్లిన్‌: జర్మనీకి చెందిన వ్యాపార సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ‘ఎస్‌ఏపీ’కి దశాబ్ద కాలం పాటు సీఈవోగా పనిచేసిన అమెరిన్‌ వ్యాపారవేత్త బిల్‌ మెక్‌ డెర్మాట్‌ శుక్రవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. తన పదవీ కాలాన్ని పొడిగించుకోకూడదని మెక్‌డెర్మాట్‌ నిర్ణయించుకున్నారని, తన బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఎస్‌ఏపీ ప్రకటించింది. బోర్డు సభ్యురాలు జెన్నిఫర్‌ మోర్గాన్‌ను సీఈవోగా, మరో సభ్యుడు క్రిస్టియన్‌ క్లీన్‌ను సహ సీఈవోగా నియమిస్తున్నట్టు ఎస్‌ఏపీ

Most from this category