News


కోల్‌ ఇండియా లాభం రూ.4,630 కోట్లు

Wednesday 14th August 2019
news_main1565761273.png-27756

  • రూ.26,089 కోట్లకు మొత్తం ఆదాయం 
  • ఈ క్యూ1లో 137 మిలయన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్‌ దిగ్గజం, కోల్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.4,630 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ1లో రూ.3,786 కోట్ల నికర లాభం ఆర్జించామని కోల్‌ ఇండియా తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో ఈ క్యూ1లో నికర లాభం బాగా పెరిగిందని పేర్కొంది. గత క్యూ1లో రూ.25,359 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.26,089 కోట్లకు పెరిగిందని వివరించింది. మొత్తం వ్యయాలు రూ.19,272 కోట్ల నుంచి రూ.19,077 కోట్లకు తగ్గాయని తెలిపింది. 

గత క్యూ1లో 136.85 మిలియన్‌ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి ఈ క్యూ1లో స్వల్పంగా పెరిగి 136.94 మిలియన్‌ టన్నులకు పెరిగిందని కోల్‌ ఇండియా తెలిపింది. ఇక స్టాండ్‌అలోన్ పరంగా చూస్తే, గత క్యూ1లో రూ.68 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.83 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆదాయం రూ.282.65 కోట్ల నుంచి రూ.282.77 కోట్లకు ఎగసిందని వివరించింది. దేశీయంగా ఉత్పత్తయ్యే మొత్తం బొగ్గులో కోల్‌ ఇండియా వాటా 80 శాతానికి మించి ఉంటుంది. 



You may be interested

200 కౌంటర్లలో బుల్లిష్‌ సంకేతాలు

Wednesday 14th August 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

ఎన్‌బీఎఫ్‌సీ పరిధిలోకి గృహ రుణ కంపెనీలు

Wednesday 14th August 2019

ఇక వీటిపై ఆర్‌బీఐ నియంత్రణలు ఎన్‌బీఎఫ్‌సీ పరిధిలోకి గృహ రుణ కంపెనీ గృహ రుణ కంపెనీలు (హౌసింగ్‌ ఫైనాన్స్‌) ఇక బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌ల) పరిధిలోకి రానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయం వల్ల ఇకపై హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఆర్‌బీఐ ప్రత్యక్ష నియంత్రణలోకి రానున్నాయి. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ యాక్ట్‌, 1987 సరవణ ప్రకారం, తాజా పరిణామం

Most from this category