News


కోపరేటివ్‌ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు చర్యలు

Friday 11th October 2019
news_main1570766238.png-28815

  • అవసరమైతే చట్టానికి సవరణలు
  • ఇందు కోసం ఓ ప్యానెల్‌ ఏర్పాటు
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన

ముంబై: కోపరేటివ్‌ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు అవసరమైతే చట్టంలో సవరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇటీవలే ఆర్‌బీఐ ఆంక్షల పరిధిలోకి వెళ్లిన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్ల ఆగ్రహాన్ని మంత్రి గురువారం ముంబై వచ్చిన సందర్భంగా స్వయంగా చవిచూశారు. దక్షిణ ముంబైలోని బీజేపీ కార్యాలయం వద్దకు పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లు చేరుకుని తమ డబ్బులను పూర్తిగా తమకు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు డిపాజిటర్లను మంత్రి లోపలకు తీసుకెళ్లి, స్వయంగా మాట్లాడి వారి ఆందోళనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కోపరేటివ్‌ బ్యాంకుల్లో పాలన మెరుగ్గా ఉండేందుకు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌తో ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోపరేటివ్‌ బ్యాంకుల చట్టంలో లోపాలు ఉన్నాయని తాను భావించడం లేదన్నారు. కాకపోతే, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందుకే ప్యానెల్‌ ఏర్పాటు అని చెప్పారు. అవసరమైతే కోపరేటివ్‌ బ్యాంకుల చట్టాలకు సవరణలను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చేపడతామని తెలిపారు. 
ప్రభుత్వ పాత్ర పరిమితమే..
బహుళ రాష్ట్రాల్లో పనిచేసే కోపరేటివ్‌ బ్యాంకులను ఆర్‌బీఐ నియంత్రిస్తుందని డిపాజిటర్లకు చెప్పినట్టు మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర పరిమితమేనన్నారు. కాకపోతే డిపాజిటర్ల అత్యవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్‌బీఐ గవర్నర్‌ను కోరతానని ఆమె హామీ ఇచ్చారు. పీఎంసీ బ్యాంకులో రుణాల కుంభకోణం వెలుగు చూడడం, ఎన్‌పీఏల గణాంకాల్లో బ్యాంకు అక్రమాలకు పాల్పడడంతో ఆర్‌బీఐ ఆంక్షలను అమలు చేసిన విషయం గమనార్హం. ఒక్కో ఖాతా (సేవింగ్స్‌, కరెంటు, డిపాజిట్‌) నుంచి గరిష్టంగా రూ.10,000 మాత్రమే ఉపసంహరణకు అనుమతించింది. పీఎంసీ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా తన మొత్తం రుణాల్లో (సుమారు రూ.9వేల కోట్లు) 70 శాతం మేర హెచ్‌డీఐఎల్‌ ఖాతా ఒక్కదానికే ఇవ్వడం గమనార్హం. 
వృద్ధి కోసం ప్రోత్సాహకాలు
దేశం ఆర్థిక మందగమనం ఎదుర్కొంటోందని ప్రభుత్వం అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నకు... మంత్రి నిర్మలా సీతారామన్‌ సూటి సమాధానం దాటవేశారు. రంగాలవారీగా అవసరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. సాయం అవసరమైన అన్ని రంగాలకు ఉపశమనం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. You may be interested

వృద్ధి 5.8 శాతమే: మూడీస్‌

Friday 11th October 2019

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) 5.8 శాతంగానే ఉంటుందని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 6.2 శాతం. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా 6.1 శాతం. మూడీస్‌ తాజా అంచనాలు ఆర్‌బీఐ అంచనాలకన్నా తక్కువ కావడం గమనార్హం. పెట్టుబడుల మందగమనం దీనితో వినియోగం తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యపరమైన

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 11th October 2019

అమెరికా-చైనాల మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్ల సంకేతాలకు అనుగుణంగా భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 114 పాయింట్ల లాభంతో 37,994 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల పెరుగుదలతో 11,257 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. చైనా వైస్‌ప్రెసిడెంట్‌తో తాను శుక్రవారం సమావేశం కానున్నానని, గురువారం ఇరుదేశాల మధ్య మొదలైన వాణిజ్య చర్చలు బాగా కొనసాగుతున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు

Most from this category