News


చైనాలో పరిశ్రమలు పునఃప్రారంభం

Wednesday 25th March 2020
Markets_main1585131598.png-32676

ప్రపంచమంతా కరోనా వైరస్‌ కల్లోలంతో విలవిలాడుతుంటే..మరో పక్క చైనాలో మాత్రం పరిశ్రమలు తెరుచుకుని పనులు ప్రారంభిస్తున్నాయి. యూరప్, యూఎస్, ఇండియా, లాటిన్‌ అమెరికా వంటి దేశాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనా పుట్టిన చైనాలో మాత్రం ఇందుకు భిన్న వాతావరణం నెలకొంది. చైనాలో పరిస్థితులు కాస్తంత చక్కబడడంతో  కంపెనీలన్నీ క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఆ దేశంలో కరోనా కేసులు తగ్గడం, కొత్త కేసులు కూడా నమోదవకపోవడంతో ఆ దేశంలోని తయారీ పరిశ్రమలు తిరిగి పనులు ప్రారంభించాయి. 

ఇక కరోనాతో 3వేలమందికిపైగా  ప్రాణాలు కోల్పోయిన వుహాన్‌ నగరంలో కూడా త్వరలో లాక్‌ డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు సమాచారం. వైరస్‌ ప్రభావంతో గత నెలలో నేలచూపులు చూసిన వివిధ రకాల ఇండస్ట్రీ ఉత్పత్తులు తాజాగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. చైనా ఇండస్ట్రీయల్‌ కాంప్లెక్స్‌లో తిరిగి కార్యకలాపాలను నిర్వహించినట్లు శాన్‌ఫోర్డ్‌ విశ్లేషకులు సి.బెర్నెస్టేయిన్‌ వెల్లడించారు. దీంతో వివిధ రకాల ప్రరిశ్రమలు అతి త్వరలోనే పుంజుకుంటాయని అయన అభిప్రాయపడ్డారు.

ఎయిర్‌లైన్స్‌...
చైనాలో గత నెలలో పూర్తిగా నిలిపివేసిన విమాన సర్వీసుల్ని తిరిగి పునరుద్దరించారు. గత వారం రోజులుగా షెడ్యూల్డ్‌ సామర్థ్యం 2.4 శాతం పెరిగి 9.2 మిలియన్ల సీట్ల సామర్థ్యానికి చేరింది. కాగా ప్రపంచంలో టాప్‌ 10 స్థానాల్లో ఉన్న ఏవియేషన్స్‌ అన్ని క్షీణిస్తున్నాయని వరల్డ్‌ ఏవియేషన్‌ ఓఏజీ ఏవియేషన్‌ సంస్థ తెలిపింది. ఇక ఇతర రవాణా సబ్‌వే ట్రాఫిక్‌ 21 శాతం పెరిగింది. ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెరిగి సాధరాణ స్థితికి చేరుకుంటున్నాయి. చైనాలో ఉన్న వివిధ ఆటో మొబైల్‌ కంపెనీలు తమ ప్లాంట్‌లలో తిరిగి పనిని ప్రారంభించాయి. విడిభాగాల కొరత ఉన్నప్పటికీ రోజురోజుకీ తమ కార్ల ఉత్పత్తి పెరుగుతుందని జపాన్‌కు చెందిన హోండా కంపెనీ వెల్లడించింది. చైనాలో ఉన్న ఇతర కంపెనీలైన నిస్సాన్‌, సెయిక్‌ మోటర్‌ కార్, టెస్లా, టయోటా, వోక్స్‌వ్యాగన్‌ వంటి కంపెనీలు కూడా తమ తయారీ కేంద్రాలను తెరిచాయని బెర్నెస్టేయిన్‌ వివరించారు.  



You may be interested

మూడోరోజూ లోయర్‌ సర్కూ‍్యట్‌ను తాకిన ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌

Wednesday 25th March 2020

వరుసగా మూడోరోజు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేరు లోయర్‌ సర్యూట్‌ను తాకింది. బుధవారం 10శాతం పతనంతో 472.60 వద్ద లోయర్ సర్కూ‍్యట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యింది.  కరోనా వైరస్‌ ప్రభావంతో రుణాలు తిరిగి వసూలు కాకపోవచ్చనే అంచనాలతో బ్యాంక్‌ వృద్ది తగ్గుముఖం పట్టవచ్చనే అందోళనలు షేరు పతనానికి కారణమవుతున్నాయి. 2017లో ఎక్సెంజ్‌లో లిస్ట్‌ అయిన ఈ బ్యాంక్‌ షేరు ఇప్పటిదాక ఇంతటి కనిష్టస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. కాగా

కరోనా ఎఫెక్ట్‌: ఫ్లిప్‌కార్ట్‌ సేవలు నిరవధిక వాయిదా

Wednesday 25th March 2020

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన సేవల్ని నిరవధికంగా వాయిదా వేసింది. కరోనా వ్యాధి నివారణ చర్యలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మంగళవారం అర్థరాత్రి నుంచి మరో 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఈయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ తమ కార్యాకలాపాలతో పాటు మంగళవారం రాత్రి నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లను స్వీకరించడం కూడా నిలిపివేసింది. ఏప్రిల్‌2 వరకు

Most from this category