News


బీపీసీఎల్‌ లాభం మూడు రెట్లు అప్‌

Friday 14th February 2020
news_main1581650962.png-31778

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొ లిమిటెడ్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో  మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో రూ.699 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.2,051 కోట్లకు పెరిగింది. స్థూల లాభం రూ.638 కోట్ల నుంచి రూ.2,247 కోట్లకు ఎగసింది. నికర లాభం మూడు రెట్లు పెరిగినా, కార్యకలాపాల ఆదాయం మాత్రం తగ్గింది. గత క్యూ3లో రూ.89,325 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో రూ.85,927 కోట్లకు తగ్గింది. 



You may be interested

షేర్ల దుర్వినియోగానికి చెక్‌

Friday 14th February 2020

ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందించిన సెబీ న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను స్టాక్ బ్రోకర్లు సొంతానికి వాడుకున్నా, ఇన్వెస్టర్ల నిధులను పక్కదారి పట్టించినా సత్వరం గుర్తించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ సిస్టమ్‌ను రూపొందించినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో స్టాక్ ఎక్స్చేంజీలను ఈ సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేస్తుందని పేర్కొంది. క్లయింట్లు తనఖాగా ఉంచిన షేర్లను కొన్ని బ్రోకింగ్ సంస్థలు.. సొంత అవసరాల కోసం లేదా ఇతర క్లయింట్ల అవసరాల

బ్యాంకింగ్‌కు మోసాల దెబ్బ రూ. 1.17 లక్షల కోట్లు!

Friday 14th February 2020

ఇండోర్‌: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు సంబంధించి 2019 ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వెల్లడైన అంశమిది. ఆర్‌టీఐ కింద దరఖాస్తు దాఖలు చేసిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే ఒక వ్యక్తి, ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ గణాంకాలను ఉటంకిస్తూ  తాజా వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- బ్యాంకింగ్‌ మోసాల విషయంలో ఎస్‌బీఐ ముందు నిలిచింది.  బ్యాంకుల

Most from this category