News


ఏజీఆర్‌ కేసులో టెలికం కంపెనీలకు షాక్‌

Friday 14th February 2020
Markets_main1581660700.png-31788

కోర్టు ఆదేశాల బేఖాతరుపై సుప్రీం కోర్టు సీరియస్‌
కంపెనీల ఎండీలను కోర్టుకు హాజరుకమ్మని ఆదేశాలు
పతన బాట పట్టిన టెలికం, బ్యాంకు షేర్లు

ఏజీఆర్‌ బకాయిల విషయంలో టెలికం కంపెనీలకు తాజాగా షాక్‌ తగిలింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ అంశంలో సంబంధిత టెలికం శాఖ(డాట్‌) అధికారిని సైతం కోర్టు తప్పుపట్టినట్లు తెలుస్తోంది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు సంబంధించి న్యూ షెడ్యూల్‌ను జారీ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ టెలికం కంపెనీలు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా తాజా ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. పూర్తి వివరాలు వెల్లడికావలసి ఉంది. కాగా.. ఉదయం 11.30 ప్రాంతంలో సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగా అటు టెలికం, ఇటు బ్యాంకింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. 

షేర్లు పతనం
ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభంకానున్న నేపథ్యంలో తొలుత వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో 12 శాతంపైగా పెరిగి రూ. 5.45ను తాకింది. తదుపరి అమ్మకాలు ఊపందుకుని 8 శాతం పతనమైంది. ప్రస్తుతం రూ. 4.15 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 3.95 వరకూ జారింది. ఇక భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేరు సైతం దాదాపు 4 శాతం పతనమై రూ. 236 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 251 వద్ద గరిష్టాన్ని తాకగా, రూ. 228 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. అయితే భారతీ ఎయిర్‌టెల్‌ 4 శాతం లాభపడి రూ. 560 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 560వద్ద గరిష్టాన్నీ, రూ. 534 వద్ద కనిష్టాన్నీ తాకింది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ డీలా
టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన పలు బ్యాంక్‌ కౌంటర్లు నేలచూపులతో కదులుతున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ 2 శాతం క్షీణించి రూ. 40కు చేరగా.. ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 



You may be interested

52 వారాల కనిష్టానికి చేరిన 77 షేర్లు

Friday 14th February 2020

శుక్రవారం  52 వారాల కనిష్టానికి 77 షేర్లు చేరాయి. వీటిలో 3పి ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఆగ్రోఫోస్‌ ఇండియా, ఆంధ్రా పేపర్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కోటెక్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్‌, బాట్రానిక్స్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, బిర్లా టైర్స్‌, కంట్రీ క్లబ్‌ హస్పిటాలిటీ అండ్‌ హాలిడ్సే, సెలస్ట్రియల్‌ బయోల్యాబ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌, కాంపుకమ్‌ సాఫ్ట్‌వేర్‌,

ఎల్‌ఐసీ విలువ ఎంత?!

Friday 14th February 2020

పలు రకాల మదింపులు చేస్తున్న నిపుణులు రూ. 9.5 లక్షల కోట్లుండొచ్చని అంచనా లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో వాటాలు విక్రయించాలన్న ప్రభుత్వ ఆలోచన దేశీయ మార్కెట్లో అతిపెద్ద మార్కెట్‌వాల్యూ ఉన్న లిస్టెడ్‌ కంపెనీని సృష్టించబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ. 70 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఐపీఓ కార్యరూపం దాలిస్తే దేశంలో అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టిస్తుంది. ఐపీఓ విజయవంతంగా

Most from this category