News


బ్యాంకుల పనివేళలు మారాయి..

Wednesday 25th March 2020
Markets_main1585156751.png-32680

కరోనా వైరస్‌ నివారణ చర్యలు, లౌక్‌డౌన్‌ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వాటి వేళ్లలో మార్పులు చేశాయి. లౌక్‌డౌన్‌ తొలగిపోయే తక్కువ సిబ్బందితో, తక్కువ సమయం పాటు సేవలు అందించనున్నాయి. బ్యాంకు శాఖలకు రాకుండా ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకులు కస్టమర్లను సూచిస్తున్నాయి. చెల్లింపులు, నగదు బదిలీ లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌లు వంటివి మినహా ఇతర బ్యాంకింగ్‌ సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకు ఉద్యోగుల స్వీయ రక్షణకుతోడు, ఉద్యోగుల రాకపోకలకు అవాంతరాల నేపథ్యంలో బ్యాంకులు తమ నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. 

 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
బ్యాంకు శాఖలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. ఈ నెల 31 వరకు ఈ వేళలు అమల్లో ఉంటాయి. పాస్‌బుక్‌లో లావాదేవీల నమోదు, విదేశీ కరెన్సీ కొనుగోళ్ల కార్యకలాపాలను నిలిపివేసింది. 

 

ఐసీఐసీఐ బ్యాంకు
తగ్గించిన ఉద్యోగులతో యథావిధిగా తమ శాఖలు పనిచేస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో తెలియజేసింది. తమ కాంటాక్ట్‌ సెంటర్‌ కూడా తక్కువ సిబ్బందితో నడుస్తుందని తెలిపింది. ఇంట్లోనే భద్రంగా ఉండి, ఐమొబైల్‌/ఇంటర్నెట్‌ బ్యాంకు ద్వారా కనీస బ్యాంకు సేవలు పొందాలని కస్టమర్లను కోరింది. కార్డులు, చెక్కు బుక్కుల జారీ ఆలస్యం కావచ్చని తెలియజేసింది. 

 

యస్‌ బ్యాంకు
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ నెలాఖరు వరకు తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని యస్‌ బ్యాంకు తన కస్టమర్లకు తెలిపింది. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకోవాలని కోరింది. 

 

హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు
ఈ నెల 23 నుంచి తమ బ్యాంకు శాఖలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు సమాచారం ఇచ్చింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఈ వేళలో అమల్లో ఉంటాయని తెలిపింది. 

 

యాక్సిస్‌ బ్యాంకు
సేవింగ్స్‌ ఖాతా, కరెంటు ఖాతా, ప్రీపెయిడ్‌ కార్డు కస్టమర్లకు ఆన్‌లైన్‌ చెల్లింపుల చార్జీలను యాక్సిస్‌ బ్యాంకు ఎత్తివేసింది. ఈ నెలాఖరు వరకు ఇది అమలవుతుందని తెలిపింది. 

 

ఎస్‌బీఐ
ఎస్‌బీఐ బ్యాంకు శాఖలు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేయనున్నాయి. 

 

బ్యాంకు ఆఫ్‌ బరోడా
డిజిటల్‌ లావాదేవీలపై ఎటువంటి చార్జీలు విధించడం లేదని బ్యాంకు ఆఫ్‌ బరోడా తెలిపింది. నగదు లావాదేవీలు వద్దని, బ్యాంకు శాఖలకు రాకుండా డిజిటల్‌ చెల్లింపులు చేసుకోవాలని సూచించింది. 

 

కోటక్‌ మహీంద్రా బ్యాంకు
ఉద్యోగుల సంఖ్యను కుదించామని, బ్యాంకు శాఖల వేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదని కోటక్‌ బ్యాంకు తెలిపింది. 

 

ఫెడరల్‌ బ్యాంకు
తెలంగాణలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు బ్యాంకు శాఖలు పనిచేస్తాయని ఫెడరల్‌ బ్యాంకు తెలిపింది. మిగతా రాష్ట్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయని స్పష్టం చేసింది.You may be interested

లాక్‌డౌన్‌ మూల్యం రూ.9 లక్షల కోట్లు

Thursday 26th March 2020

జీడీపీలో 4 శాతం మేర ప్రభావం 2020-21 వృద్ధి 3.5 శాతం: బార్‌క్లేస్‌ ముంబై: కోవిడ్‌ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. వైరస్‌ విస్తరించకుండా నివారణ చర్యల్లో భాగంగా మూడు వారాల పాటు దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ (మూసివేత)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల 120 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9లక్షల కోట్లు) మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. ఇది భారత జీడీపీలో

క్వాలిటీ స్టాక్స్‌ కొనుగోలుకు మంచి సమయం

Wednesday 25th March 2020

ప్రస్తుత మార్కెట్‌ పతనంలో నాణ్యమైన కంపెనీలు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచి ఆలోచనగా లాడరప్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ ఎండీ రాఘవేంద్ర పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల ఆస్తుల్లో మార్పులు చేసుకోవాలని.. ఈక్విటీలకు మూడేళ్ల దృష్టితో మరింత కేటాయింపులు చేసుకోవాలని సూచించారు.   నాణ్యమైన స్టాక్స్‌ ఇప్పుడు ఎంతో చౌక ధరల్లో లభిస్తున్నాయని రాఘవేంద్ర అన్నారు. కనుక వాటిల్లో పెట్టుబడులకు ఇది చక్కని తరుణంగా పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు నాణ్యమైన

Most from this category