News


క్షీణత నుంచి లాభాల్లోకి బ్యాంక్‌ షేర్లు

Friday 16th August 2019
Markets_main1565942651.png-27811

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వలన దేశియ మార్కెట్లు శుక్రవారం నెగిటివ్‌గా ప్రారంభమై మధ్యాహ్నాం 1.17 సమయానికి పాజిటివ్‌లోకి మళ్లాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ శుక్రవారం 27920.30 పాయింట్ల వద్ద నెగిటివ్‌లో ప్రారంభమవ్వగా, మధ్యాహ్నాం 1.17 సమయానికి 170.60 పాయింట్లు లాభపడి 28189.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో ఈ ఇండెక్స్‌ 28019.20 ముగియగా, శుక్రవారం ట్రేడింగ్‌లో పతన స్థాయి నుంచి 270 పాయింట్లు పెరగడం గమనార్హం. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.02 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.35 శాతం లాభపడి ట్రేడవుతోంది. మిగిలిన షేర్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 0.12 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.48 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)2.44 శాతం లాభపడ్డాయి. అదే విధంగా ప్రవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లయిన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లి. 1.93 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.47 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.95 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.81 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.18 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లి. 2.71 శాతం, యస్‌ బ్యాంక్‌ 4.77 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి.



You may be interested

నిఫ్టీ పతనం 9700 పాయింట్ల వరకు....!

Friday 16th August 2019

క్యాపిటల్‌ ఎయిమ్‌ రిసెర్చ్‌ హెడ్‌ రమేశ్‌ తివారి సమీప భవిష్యత్‌లో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక ఆందోళనలు నిఫ్టీని 9700 వరకు దిగజారుస్తాయని క్యాపిటల్‌ ఎయిమ్‌ సంస్థ రిసెర్చ్‌ హెడ్‌ రమేశ్‌ తివారి అభిప్రాయపడ్డారు. ఒకటి రెండు త్రైమాసికాల పాటు నిఫ్టీ 10000- 12000 పాయింట్ల మధ్య కదలాడవచ్చని, ఒకమారు కనిష్ఠాలను తాకిన తర్వాతే మరో కొత్త ర్యాలీ ఆరంభమవుతుందని చెప్పారు. ఈ కన్సాలిడేషన్‌ పూర్తయ్యాక నిఫ్టీ 13000 పాయింట్లను చేరవచ్చని అంచనా

మరోసారి నిధుల సమీకరణకు సిద్ధమైన యస్‌ బ్యాంక్‌

Friday 16th August 2019

ఇటీవల క్యూఐపీ ఇష్యూ విజయవంతమైన నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ మరో 600 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.43 కోట్లు) నిధుల సమీకరణకు రంగం సిద్ధం చేస్తోంది. రుణదాతలు సూచించిన మూలధన పెంపు ప్రణాళికల్లో భాగంగా పెద్దస్థాయి ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తం నిధులను సమీకరించేందుకు యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లో ప్రతికూల వాతవరణం ఉన్నప్పటికీ బ్యాంకు 270 మిలియన్‌ డాలర్ల క్యూఐపీ ఇష్యూకు

Most from this category