News


26, 27 సమ్మెచేస్తాం

Friday 13th September 2019
news_main1568348261.png-28342

  •  బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్ల నోటీస్‌
  • నవంబర్‌ రెండవ వారంలో
  • నిరవధిక సమ్మెకూ హెచ్చరిక

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో విలీనాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో రెండు రోజులు సమ్మె చేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్లు నాలుగు హెచ్చరించాయి. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగుగా మార్చుతూ  విలీన పర్వానికి ఆగస్టు 30వ తేదీన  కేంద్రం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తాజా సమ్మె హెచ్చరిక వెలువడింది. ఇండియన్‌ బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్లు  ఒక సంయుక్త సమ్మె నోటీసు ఇస్తూ విలీనాలకు నిరసనగా సమ్మె ప్రతిపాదన తలపెట్టినట్లు పేర్కొన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ, నవంబర్‌ రెండవ వారం నుంచీ నిరవధిక సమ్మెనూ నిర్వహించడం జరుగుతుందని ఒక యూనియన్‌ నాయకుడు పేర్కొన్నారు. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీఓఏ), ఇండియన్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌బీఓసీ), నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ (ఎన్‌ఓబీఓ) సంయుక్త సమ్మె నోటీసు ఇచ్చిన వాటిలో ఉన్నాయి. ఐదు రోజుల పనిదినాలను పూర్తి స్థాయిలో అమలు, నగదు లావాదేవీల సమయం తగ్గించడం, పనిగంటల హేతుబద్దీకరణ వంటి పలు డిమాండ్లనూ యూనియన్లు చేస్తున్నాయి. 

విలీన ప్రక్రియలో బ్యాంకులు బిజీబిజీ...
ఇదిలావుండగా, విలీన పక్రియ వేగవంతం దిశలో సంబంధిత బ్యాంకులు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. ఇండియన్‌ బ్యాంక్‌తో తన విలీన అంశాలను పరిశీలించడానికి సెప్టెంబర్‌ 13న తమ బోర్డ్‌ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం కానుందని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి సెప్టెంబర్‌ 13న ఆంధ్రాబ్యాంక్‌ బోర్డ్‌ సమావేశం కానుంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో ఆంధ్రాబ్యాంక్‌తో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ విలీనానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓబీసీ, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌ విలీనానికి కేం‍ద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఇలా మొత్తం 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు పరిమితం కానుంది. మరోవైపు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఒక ప్రకటన చేస్తూ తాజా విలీనానికి సంబంధించి అంశాల పరిశీలనకు విలీన రెండు బ్యాంకులతో కలిసి (యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓబీసీ) 23 కార్యాచరణ గ్రూప్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

విలీనాలు మంచిదే:  ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌
 కేంద్రం ప్రకటించిన బ్యాంకింగ్‌ విలీనాల ప్రక్రియ పూర్తి సానుకూల అంశమని ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ గ్లోబల్‌ చీఫ్‌ (విక్రయాలు) వెంకటరమణ గోసావి పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ బిజినెస్‌ వృద్ధికి కూడా ఈ చర్యల దోహదపడుతుందని బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ అయిన ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌ పేర్కొంది. 

 



You may be interested

ఈసీబీ తాజా ఉద్దీపన

Friday 13th September 2019

22 బిలియన్‌ డాలర్ల  విలువైన బాండ్ల కొనుగోలు రివర్స్‌ డిపాజిట్‌ రేట్లు మరింత కిందకు... లండన్‌: ఆర్థిక పరిస్థితులను చక్రదిద్దే క్రమంలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) మరో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది. దీనిప్రకారం, నెలకు 20 బిలియన్‌ యూరోల (22 బిలియన్ల అమెరికా డాలర్లు) విలువైన బాండ్లను వ్యవస్థ నుంచి కొనుగోలు చేయనుంది. దీనితో ఆర్థిక వ్యవస్థలోకి ఈ మొత్తం వచ్చి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందన్నది సిద్దాంతం. ఇక ఇదే దిశలో వడ్డీరేట్లనూ

ఆర్థిక గణాంకాల నిరాశ!

Friday 13th September 2019

పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం జూలైలో ఉత్పత్తి వృద్ధి 4.3 శాతం గత ఏడాది ఇదే నెల్లో 6.5 శాతం వృద్ధి అదుపులోనే ఉన్నా...  రిటైల్‌ ద్రవ్యోల్బణం పైకే! ఆగస్టులో 3.21 శాతం ఆహార ఉత్పత్తుల ధరలు పైకి న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గురువారం వెలువడిన కీలక గణాంకాలు నిరాశపరిచాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 4.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 6.5

Most from this category