News


ఇంట్రాడే గరిష్టం నుంచి బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Friday 13th September 2019
Markets_main1568361380.png-28355

బ్యాంకింగ్‌ రంగ అ‍‍మ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఇంట్రాడే గరిష్టం నుంచి 1శాతానికి పైగా పతనమైంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,772.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 100 పాయింట్లు పెరిగి 27,908.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్లో నెలకొన్న అమ్మకాలతో ఇండెక్స్‌ తిరిగి నష్టాల్లో మళ్లింది. ఇంట్రాడే గరిష్టస్థాయి(27,908.20) నుంచి 1.21శాతం (337 పాయింట్లు) క్షీణించి 27573.45 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,818.50)తో పోలిస్తే 0.23శాతం నష్టంతో 27,755.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం క్షీణించింది. యస్‌బ్యాంక్‌ 2.50శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 2శాతం నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1శాతం వరకు క్షీణించాయి. యస్‌బీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు అరశాతం పతనమయ్యాయి. మరోవైపు కోటక్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. 



You may be interested

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు ..!

Friday 13th September 2019

మార్కెట్‌ లాభనష్టాల మధ్య ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., రియల్టీరంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌ వద్ద 265.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి రియల్టీరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ ఒకదశలో 1.65శాతం పెరిగి 268.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:50ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(264.25)తో

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల టాప్‌ సిఫార్సులు

Friday 13th September 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల సిఫార్స్‌ చేసిన టాప్‌ స్టాకులు: బ్రోకరేజి: జేపీ మోర్గాన్‌ ఇన్ఫోసిస్‌ స్టాక్‌పై ‘ఓవర్‌ వెయిట్’ను కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను షేరుకు రూ. 850గా ఈ బ్రోకరేజి నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇన్ఫోసిస్‌ బాగా ప్రదర్శన చేసిందని, రిస్క్‌ తీసుకోకూడదని అనుకునే వారికి ఈ స్టాకు ఇప్పటికీ ఆకర్షణియంగా కనిపిస్తోందని ఈ బ్రోకరేజి తెలిపింది. ఈ కంపెనీ ఆదాయవృద్ధి ఆర్థిక సంవత్సరం 2021 లో ఓ మోస్తరుగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది.  బ్రోకరేజి: సీటీ జిందాల్

Most from this category